Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ.ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 75 రైలు ప్రమాదాలు జరిగితే.. అందులో 40 మంది చనిపోయారని కేంద్ర రైల్వేశాఖ వెల్లడించింది. 2017 సెప్టెంబర్ నుంచి 2018 సెప్టెంబర్ వరకు జరిగిన ప్రమాదాల వివరాలను ప్రకటించింది. 2013, 2014లో ఎక్కువ రైలు ప్రమాదాలు సంభవించాయని తెలిపింది. అలానే 2016-17 మధ్య 80 రైలు ప్రమాదాలు జరిగ్గా, వీటిలో 249 మంది ప్రయాణికులు చనిపోయారని పేర్కొంది. అయితే ఈ ఏడాది ప్రమాదాల సంఖ్య తగ్గిందని రైల్వే చెబుతున్నా..భవిష్యత్తులో ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో దానిపై దృష్టిపెడితే బాగుంటుందని ప్రజాసంఘాలు సూచిస్తున్నాయి.