Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్లలోపు మరణాలు భారత్‌లోనే అధికం
- గతేడాది 8.8 లక్షల మందికి పైగా మృతి
- తర్వాతి స్థానాల్లో నైజీరియా.. పాక్
- యూనిసెఫ్ తాజా నివేదిక
న్యూఢిల్లీ : కేంద్రంలో మోడీ పాలనలో ప్రపంచ ఆకలి సూచీ లోనే కాదు.. చిన్నారుల మరణాల విషయంలో నూ భారత్ ప్రదర్శన దారుణంగా ఉన్నది. ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలతో వైద్యరంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని కేంద్రం చెప్పుకుంటున్నది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం వాస్తవపరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చుకుంటే ఐదేండ్లలోపు చిన్నారుల మరణాలు 2018లో భారత్‌లోనే అధికంగా చోటుచేసుకోవడమే మోడీ సర్కారు వైఫల్యాన్ని తెలియజేస్తున్నది. భారత్‌లో గతేడాది దాదాపు 8.8 లక్షల మందికి పైగా చిన్నారులు మృతి చెందారు. గతేడాదికి సంబంధించి ' ది యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్(యూనిసెఫ్)' తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 'ది స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ చిల్డ్రన్ (ఎస్‌ఓ డబ్య్లూసీ)' పేరుతో ఈ నివేదికను యూనిసెఫ్ ఇటీవలే విడుదల చేసింది. చిన్నారుల మరణాల విషయంలో ఆర్థికంగా మనకంటే చాలా వెనుకబడిన దేశా లు కూడా భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉండటం గమనార్హం. ఇక ఈఅంశంలో భారత్ తర్వాత నైజీరియా, పాకిస్థాన్ వంటి దేశాలు ఉన్నాయి. ఎస్‌ఓడబ్ల్యూసీ నివేదిక ప్రకారం.. భారత్‌లో అత్యధికంగా 8.82 లక్షల మంది చిన్నారులు మరణించారు. ఇక తర్వాతి స్థానాల్లో ఉన్న ఆఫ్రికా దేశం నైజీరియాలో 8.66 లక్షల మందిల
చిన్నారులు.. పొరుగుదేశం పాక్‌లో ఈ సంఖ్య 4.09 లక్షలుగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. ఇక ఐదేండ్లలోపు చిన్నారుల మరణాల సగటు భారత్‌లో ప్రతి వెయ్యి మంది జననాలకు 37గా ఉన్నట్టు తేల్చింది. ఈ సంఖ్య నైజీరియాలో 120.. పాక్‌లో 69గా ఉన్నాయి. అయితే దాదాపు 38శాతం మంది భారతీయ చిన్నారుల మరణాలు 'పెరుగుదల లోపం'తోనే చోటుచేసుకున్నాయని నివేదిక స్పష్టం చేసింది. చిన్నారుల మరణాలు సింగపూర్, డెన్మార్క్, బహ్రయిన్, న్యూజిలాండ్, వంటి దేశాలలో తక్కువగానే ఉన్నాయి. ఈ దేశాల్లో ఐదేండ్లలోపు చిన్నారుల మరణాలు 1000 కంటే తక్కువగానే చోటు చేసుకున్నాయని యూనిసెఫ్ పేర్కొన్నది.
భారత్ వంటి తక్కువ ఆదాయం గల దేశాల్లో అనారోగ్య ఆహారపు అలవాట్ల పైనా ఎస్‌ఓడబ్ల్యూసీ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. 2011-16 మధ్య భారత్‌లో ఫాస్ట్ ఫుడ్ అమ్మకాలు 113శాతం పెరిగా యని తెలిపింది. 2016-18 మధ్య దేశంలో నిర్వహించిన సర్వే ఆధారం గా 'కాంప్రహెన్సివ్ నేషనల్ న్యూట్రిషన్ సర్వే(సీఎన్‌ఎన్‌ఎస్)' ను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ కొన్ని రోజుల క్రితమే విడుదల చేసింది. దేశంలోని 35శాతం మంది చిన్నారులు పెరుగుదల లోపంతో, 33శాతం మంది చిన్నారులు తక్కువ బరువు సమస్యతో బాధపడుతున్నారని సీఎన్‌ఎన్‌ఎస్ సర్వేలో వెల్లడి కావడం గమనార్హం. చిన్నారుల్లో ఆరోగ్యం, పోషకాహార లోపం, ఊబకాయం, రక్తహీనతతో పాటు ఇతర అంశాలను యూనిసెఫ్ నివేదిక విశ్లేషించి జాబితాను విడుదల చేసింది. '2019 ప్రపంచ ఆకలి సూచీ'లో భారత్ 102వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.