Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చంఢగీడ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పలు రాజకీయ పార్టీలు ధనం, మద్యాన్ని విచ్చలవిడిగా పంచాయి. ఎన్నికల ప్రచారంలో దాదాపు రూ. 23 కోట్ల విలువైన ధనం, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. సోదాల్లో భాగంగా ఆదివారం గురుగ్రామ్‌లోని ఓ కారులో రూ. 1.33 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ ఇందర్ జీత్ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదాయ పన్ను శాఖ, పోలీసులు, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. శాంతిభద్రతలను భంగం కలుగకుండా ముందుగానే లైసెన్స్‌డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామనీ. సోదాల్లో 254 అక్రమ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 482 చెక్‌పోస్టులను పోలీస్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఎన్నికల ప్రకియకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించారు. ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.