Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20-29ఏండ్ల లోపు వారే 22శాతం
చండీగఢ్: నేడు జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్ల తీర్పే కీలకం కానున్నది. రాష్ట్రంలో 20-29 ఏండ్లలోపు వారే 22శాతం ఉండటంతో ఈ ఎన్నికల్లో వారి ఓట్లే పార్టీల భవితవ్యాన్ని శాసించనున్నాయని సామాజికవేత్తలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 1.83కోట్ల మంది ఓటర్లుండగా.. వారిలో 20-29 ఏండ్లుగల వారు 40,67,413 మంది 30-39ఏండ్లలోపు 44,92,809 మంది ఉన్నారు. మరో 3,82,446 మంది తొలి సారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మిగతా ఓటర్లంతా 40ఏండ్లు పైబడిన వారే. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 98.7 లక్షల మంది పురుష ఓటర్లు, 85.1 లక్షల మంది మహిళా ఓటర్లుండగా, 252 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లున్నారు. ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 90 అసెంబ్లీ స్థానాల్లో 19,578 పోలింగ్ స్టేషన్లు, 153 సహాయక పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 69.74శాతం మంది రాష్ట్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో హర్యానాలో అత్యధికంగా 76.54 శాతం పోలింగ్ నమోదైంది.