Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతీక్ హజేలా స్థానంలో నియామకం
గువహతి: అసోంలో వివాదాస్పద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిట ిజెన్స్(ఎన్నార్సీ)కు కో ఆర్డినేటర్‌గా హితేశ్ దేవ్ వర్మ నియమితులయ్యారు. 1986 బ్యాచ్ అసోం సివిల్ సర్వెంట్ అయిన హితేశ్.. సోమవారం(నేడు) బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఎన్నార్సీ కోఆర్డినేటర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి ప్రతీక్ హజేలా స్థానంలో హితేశ్ బాధ్యతలు స్వీకరించనుం డటం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఆర్థిక విభాగాల సెక్రెటరీగా హితేశ్ ఉన్నారు. ప్రతీక్ హజేలాను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని గతనెల 18న కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతీక్ హజేలాను అసోం-మేఘాలయ క్యాడర్ నుంచి మధ్యప్రదేశ్ క్యాడర్‌కు డిప్యూ టేషన్‌పై మూడేండ్లు పంపాలన్న సిబ్బంది శిక్షణ కేంద్ర విభాగం ప్రతిపాద నను కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఇప్పటికే ఆమోదించింది.