Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అధికారులు, జవాన్లు ఫేస్‌బుక్, వాట్సాప్‌లను ఉపయోగించరాదని భారత ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ఫేస్‌బుక్, వాట్సాప్ ఖాతాలను వెంటనే డియాక్టివేట్ చేయాలని పేర్కొంది. వాట్సాప్‌లో సమాచార మార్పిడి సురక్షితం కాదనీ.. దీనిలో అనేక భద్రతాలోపలు ఉన్నాయని తెలిపింది. వీటిల్లో అధికారిక సమాచారాన్ని పంచుకోవడం ద్వారా సైనిక రహస్యా లు బహిర్గతమయ్యే అవకాశమున్నదని వెల్లడించింది. ఈమేరకు సైన్యంలోని అన్ని కార్యాలయాల ఉన్నతాధికారులతో పాటు అన్ని విభాగాలకూ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. వాట్సాప్‌లో సమాచార మార్పిడిలో ఎండ్‌టూఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నప్పటికీ ఇటీవల ఇజ్రాయిల్‌కు చెందిన ఓ సంస్థ వాటిల్లోకి వైరస్‌ను చొప్పించి.. సమాచారాన్ని తస్కరించిందని తెలిపింది. అలాగే మొబైల్‌లో ఫేస్‌బుక్ యాప్ ఇన్‌స్టాల్ చేసే సమయంలో పలు పర్మిషన్లు అడిగి.. భద్రతాపరంగా సున్నితమైన ప్రాంతాల సమాచారం సేకరిస్తున్నదని పేర్కొంది. భారత అధికారిక సమాచారాన్ని తస్కరించడానికి ఆర్మీ సీనియర్లను ఉగ్రవాదులు టార్గెట్ చేసి హనీట్రాప్‌కు పాల్పడుతున్నారని వెల్లడించింది. ఆర్మీ అడ్వయిజరీ కమిటీ సూచనలు.. అధికారులు, జవాన్లు అధికార సమాచార మార్పిడికి వాట్సాప్‌ను ఉపయోగించరాదు. ఫేస్‌బుక్ ఖాతాలను వెంటనే డియాక్టివేట్ చేయాలి. స్మార్ట్ ఫోన్లలో అధికారిక సమాచారాన్ని భద్రపర్చకూడదనీ, ఈ మెయిల్ క్లయింట్‌ను సైతం వాడొద్దని తెలిపింది. స్మార్ట్‌ఫో న్‌ను కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసమే ఉపయోగించాలి. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడంలో జాగ్రత్త వహించాలి. అలాగే పోస్టులు పెట్టడంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సమాచారం బహిర్గతం కాకుండా ప్రైవసీ సెట్టింగు లను ఉపయోగించాలి. అలాగే తమ జీమెయిల్ ఖాతాలను ఇతర ఏ అప్లికేషన్లతోనూ లింక్ చేయకూడదని వెల్లడించింది.