Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జేఎన్‌యూ వర్సిటీ మాత్రమే కాదు.. అంతకు మించి... | జాతీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Nov 17,2019

జేఎన్‌యూ వర్సిటీ మాత్రమే కాదు.. అంతకు మించి...

- దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వర్సిటి నిరసనలు
- ప్రజాస్వామిక, సామాజిక స్పృహలో ఇతర విద్యాలయాలకు ఆదర్శం
- ఫీజుల పెంపు అణగారిన వర్గాల్ని దూరం చేసే ఎత్తుగడ : విద్యావేత్తలు
            జేఎన్‌యూలో ఉండే రాజకీయ, ప్రజాస్వామిక, సామాజిక వాతావరణం, ఫ్యాకల్టీ బోధనలు విద్యార్థుల ఆలోచనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఇక్కడ చదువుకున్న దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఎంతోమంది వివిధ రంగాల్లో ప్రముఖులుగా, పౌర, సామాజికవేత్తలుగా ఎదిగారు. ఆర్థిక నోబెల్‌ పురస్కారం పొందిన అభిజిత్‌ బెనర్జీ జేఎన్‌యూ విద్యార్థే. ఇలాంటి ఈ వర్సిటీ తమకు కొరకరాని కొయ్యిలా తయారైందని కేంద్రంలోని పాలకులు భావిస్తున్నారు. దీంతో ఘర్షణ మొదలైంది. విద్యార్థులు నిరసనబాట పట్టాల్సి వచ్చింది. విద్యార్థులు ఆందోళనలు, నిరసనలు జరిపినతీరు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
న్యూఢిల్లీ : దేశానికి మేథోపరమైన రాజకీయ కేంద్రంగా జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) నిలబడుతోందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఇక్కడ చదివే దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల విద్యార్థుల జీవితాల్ని మార్చటంలో వర్సిటీ పోషించే పాత్ర మాటల్లో చెప్పలేనిది. మనదేశంలోని ఇతర వర్సిటీల్లో కనపడని అరుదైన లక్షణం ఇక్కడ ఉందంటారు. వివిధ సామాజిక వర్గాలతో కూడిన భిన్నత్వం...వర్సిటీ ఖ్యాతిని మరింత పెంచాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులతో కూడిన ఫ్యాకల్టీ వర్సిటీకి ప్రపంచ గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ఇంత ప్రతిష్ట కలిగిన జేఎన్‌యూ తమకు పంటికింద రాయిలా మారిందని కేంద్రంలోని ప్రస్తుత పాలకులు భావిస్తున్నారు. పాలకుల విధానాల్లో లోపాల్ని ఎత్తిచూపుతున్న తీరు, విద్యార్థి ఉద్యమాలు మోడీ సర్కార్‌ను బోనులో నిలబెడుతున్నాయి. దీనిని సహించలేక, సంస్కరణల పేరుతో క్రమంగా వర్సిటీ మౌలిక స్వభావాన్ని మార్చే ప్రయత్నం పాలకులు మొదలుపెట్టారు. వర్సిటీతో బలమైన అనుబంధాన్ని పెంచుకున్న దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యార్థుల్ని దూరం చేయాలన్న ఎత్తుగడను ఎంచుకున్నారు.
మోడీ సర్కార్‌ ఆలోచన ఇదే..
రాజకీయంగా, సామాజికంగా తెరపైకి వస్తున్న పలు అంశాల్లో దేశంలోని ఇతర వర్సిటీలకు జేఎన్‌యూ ఆదర్శంగా నిలబడుతోంది. పాలకుల విధానాల్లో లోపాల్ని ఎత్తిచూపటంలో ముందుంటోంది. విద్యార్థి ఉద్యమాలకు కేంద్రంగా నిలబడుతోంది. ఇతర వర్సిటీల్లోని దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల విద్యార్థుల్లో స్ఫూర్తినింపు తోంది. ఇది మోడీ సర్కార్‌కు రుచించటం లేదని పలువురు విద్యారంగ విశ్లేషకులు చెబుతున్నారు. అణగారిన వర్గాల విద్యార్థులకు వర్సిటీ ఒక పెద్ద అండగా నిలబడుతోంది.
ఈ బంధాన్ని తెగగొట్టాలనే వ్యూహంలో భాగంగా వర్సిటీ మౌలిక స్వభావానే మార్చే ప్రయత్నం పాలకులు ప్రారంభించారు. మొదటి దశగా హాస్టల్‌ మెస్‌, వసతి ఫీజుల పెంపు, ఇతర మార్పులు చేపట్టారని తెలుస్తోంది. సంస్కరణల పేరుతో మోడీ సర్కార్‌ ఇంతటితో ఆగదనీ, జేఎన్‌యూ భిన్నమైన లక్షణాన్ని సైతం తుంచివేసే చర్యలు చేపడుతుందని విద్యారంగ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం తాత్కాలికంగా తప్పుకుంది...
జేఎన్‌యూలో ఫీజుల పెంపు నిర్ణయంపై సాగిన విద్యార్థుల నిరసనలు ప్రపంచవార్తల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిరసనల ధాటికి మోడీ సర్కార్‌ తన నిర్ణయాల్ని మార్చుకోక తప్పలేదు. చివరికి విద్యార్థులే విజయాన్ని సాధించారు. అయితే వర్సిటీకి పొంచివున్న ప్రమాదం తాత్కాలికంగా వాయిదా పడిందని మేథావులు, విద్యావేత్తలు అంటున్నారు. మళ్లీ సమయం చూసి, కేంద్రం ఫీజుల పెంపును అమల్లోకి తెస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ఒక వర్సిటీకి సంబంధించిన సమస్య కాదనీ, సామాజిక న్యాయం, విద్య వంటివి దీనితో ముడిపడి ఉన్నాయని వారు చెబుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పౌరసత్వ సెగలు.. పెల్లుబికిన ప్రజాగ్రహం
జామియా వర్సిటీ విద్యార్థులపై ఖాకీల దాష్టీకం
ఉభయసభల్లో దుమారం
దోషులను వెంటనే ఉరితీయాలి
వారి వివరాలు తెలియదు..
కేజ్రీవాల్‌ సర్కార్‌ వినూత్న నిర్ణయం
'అనాజ్‌ మండి' అగ్నిప్రమాద దోషులను కఠినంగా శిక్షించాలి : సీఐటీయూ
మూకదాడులపై సైలెంట్‌... పట్టించుకోని బీజేపీ..
పసుపు బోర్డు లేనట్టే..
కొంత కాలం ఆగండి
మానవ హక్కుల ఉల్లంఘన
ఈ ఏడాది పీహెచ్‌డీల్లో 1.7లక్షల మంది
ప్రజ్ఞా సింగ్‌కు జబల్‌పూర్‌ హైకోర్టు ఝలక్‌..!
క్యాబ్‌ రాజ్యాంగ ఉల్లంఘనే
పీడీపీ బిల్లు ఆమోదం పొందితే నియంతృత్వ రాజ్యమే
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై...త్రిసభ్య కమిషన్‌
అదాని కోసం అడ్డంగా నరికారు
ఇదే నేటి భారతం..
నిరసనలపై పేలిన తూటా
ఉద్యోగ పోరు
బంగ్లా విదేశాంగ మంత్రి భారత పర్యటన రద్దు
పెరుగుతున్న సైబర్‌ దాడులు
'అయోధ్య' తీర్పుపై రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన 'సుప్రీం'
ఢిల్లీలో తేలికపాటి వర్షం
జీఎస్టీ పరిహార నిధులను తక్షణమే ఇవ్వండి
బాకీల తెలంగాణగా మార్చారు
తగ్గుతున్న గోవులు.. పెరుగుతున్న ఖర్చులు
డేటింగ్‌ పేరిట 73 లక్షలు స్వాహా
17న నిర్భయ దోషి పిటిషన్‌ విచారణ
తుంగభద్రపై కొత్త ప్రాజెక్టు

తాజా వార్తలు

07:02 PM

బెంగాల్‌లో ఐదు రైళ్లకు నిప్పు

06:48 PM

ఎల్జీ గ్రూప్‌ మాజీ చైర్మన్‌ మృతి

06:37 PM

నూతన గేమింగ్ గేమింగ్ డెస్క్‌టాప్‌ను లాంచ్ చేసిన డెల్

06:19 PM

ఆటోడ్రైవర్లకు కౌన్సిలింగ్‌ నిర్వహించిన పోలీసులు

06:18 PM

రాహుల్ సిప్లిగంజ్ స‌ర‌స‌న రాజ‌శేఖ‌ర్ కూతురు..!

06:15 PM

డెలివరీపై కీలక నిర్ణయం తీసుకున్న అమెజాన్

06:10 PM

ట్రైనీ ఐపీఎస్‌ మహేశ్వరరెడ్డి సస్పెండ్‌

06:03 PM

ప్రముఖ కళాకారిణి లీలా శాంసన్‌పై సీబీఐ కేసు

06:00 PM

లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన సైబరాబాద్‌ సీపీ

05:54 PM

గొల్లపూడి భౌతికకాయానికి చిరు నివాళి

05:52 PM

యాదాద్రి హత్య కేసును చేధించిన పోలీసులు

05:40 PM

‘ప్రైడ్‌ ఆఫ్‌ హైదరాబాద్ అవార్డు’కు ఎంపికైన సింగరేణి ఛైర్మన్‌..

05:37 PM

లార్డ్స్ మైదానంలో ‘దాదా’ సెల్ఫీ

05:33 PM

చింతకానిలో వరిగడ్డి వాము దగ్ధం

05:32 PM

కాల్వలోకి దూసుకెళ్లిన కారు

05:19 PM

వివాహం కాలేదన్న మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

05:15 PM

డిజిటల్ చెల్లింపుల్లో దూసుకుపోతున్న ఫోన్‌పే

05:10 PM

అయేషా కేసులో న్యాయం చేస్తాం : సుచరిత

05:06 PM

గుంటూరులో కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాలు

05:01 PM

ఫోన్‌ ఛార్జింగ్‌పై ఎస్‌బీఐ హెచ్చరికలు

04:52 PM

నాయకులు వెళ్లిపోవడానికి నాదెండ్ల కారణం: రాపాక

04:50 PM

వర్మపై విమర్శలు గుప్పించిన కేఏ పాల్

04:48 PM

ఆయేషా తల్లి మాటలు బాధాకరం : రోజా

04:44 PM

మాటలు రావడం లేదు.. ప్రేమ, గౌరవం తప్ప: సెహ్వాగ్

04:42 PM

అసోంలో తాత్కాలికంగా కర్ఫ్యూ సడలింపు

04:34 PM

నిందితుడిని వెంటనే శిక్షించాలి : సీపీఐ(ఎం)

04:28 PM

మోడీకి లేఖ రాసిన స్వాతి మలివాల్

04:20 PM

నల్లధనం నిర్మూలన పేరుతో పేదల జేబులు కొట్టారు : రాహుల్

04:18 PM

వీడని వర్షం..నాలుగో రోజు మ్యాచ్‌ రద్దు

04:04 PM

పౌరసత్వ చట్టంపై సుప్రీంలో అసదుద్దీన్‌ పిటిషన్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.