Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఉల్లి ధర రోజురోజుకూ అమాంతం పెరుగుతూనే ఉన్నది. దేశంలోని ప్రధాన నగరాల మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూ.165 పైగా పలుకుతున్నది. వినియోగదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం పనాజీ రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.165కు చేరింది. మహారాష్ట్రలోని నాసిక్ మినహా అన్ని ప్రాంతాల్లో ఉల్లి ధర రూ.120పైగా చేరింది. హైదరాబాద్, కొల్‌కతా, బెంగళూరులలో అయితే కిలో ఉల్లి ధర రూ. 180లుగా నమోదుకావడం గమనార్హం. కాగా, ఉల్లి ఘాటుతో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే 1.2 లక్షల ఉల్లి దిగుమతికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ధాన్వే రావుసాహెబ్ రాజ్యసభలో వెల్లడించారు. అయితే ఈ ఉల్లి జనవరి 20నాటికి భారత్‌కు రానున్నదని తెలిపారు. 'ఉల్లి ధరలు పెరుగుతున్నాయనడంలో సందేహం లేదు. భారీ వర్షాల వల్ల పంట దెబ్బతినటమే దీనికి ప్రధాన కారణం. త్వరలోనే సరసమైన ధరలకు ఉల్లిని అందుబాటులోకి తీసుకొస్తామ'ని ఆయన చెప్పారు.