Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కతా : పసికందు నుంచి ముసలివాళ్ల వరకు మృగాళ్ళు ఎవ్వరినీ వదలటంలేదు. దారుణాలకు తెగబడుతూనే ఉన్నారు. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఒకపక్క చర్చ నడుస్తుండగా.. తాజాగా తొమ్మిది నెలల పసికందుపై మేనమామే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పశ్చిమబెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఈ అకృత్యం వెలుగులోకి వచ్చింది. శ్యాంపూర్ పరిధిలోని బార్గావ్ ప్రాంతంలో తొమ్మిది నెలల చిన్నారితో కలిసి ఓ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటి పక్కనే ఉంటున్న మేనమామ బొమ్మలు కొనిస్తానని చెప్పి బుధవారం పాపను తీసుకెళ్లాడు. కొద్ది గంటల తర్వాత ఏమీ తెలియనట్టు పాపను ఇంట్లో దింపి వెళ్ళిపోయాడు. చిన్నారికి రక్తస్రావం అవుతుండటాన్ని గమనించిన తల్లి కుటుంబసభ్యులకు తెలిపింది. అనుమానంతో వారు శ్యాంపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు అనుప్ ప్రమానిక్‌ను విచారించగా.. దారుణాన్ని బయటపెట్టాడు. పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.