Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదిలాబాద్ ఎంపీ సోయం డిమాండ్
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
షెడ్యూల్ తెగ(ఎస్టీ) నుంచి లంబాడాలను తొలగించాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాబూరావు డిమాండ్ చేశారు. 1976 దేశంలో అత్యయిక పరిస్థితి(ఎమర్జన్సీ) విధించిన సమయంలో నియమ నిబంధలనకు విరుద్ధంగా లంబాడాలను ఎస్టీ జాబితాలో అప్పటి ప్రభుత్వం చేర్చినట్టు ఆయన చెప్పారు. ఒక కులాన్ని సామాజిక హౌదా ప్రకారం వేరే కులాల్లో కలిపేందుకు ఒక న్యాయమైన ప్రక్రియ ఉంటుందని చెప్పారు. లంబాడాలను ఎస్టీల్లో కలిసిన తీరు న్యాయమైన ప్రక్రియకు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. ఈ విషయంపై శనివారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాగా, ఈ సమావేశంలో మాజీ ఎంపీ కుంజా సత్యవతి, ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.