Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్‌లో మెడిసిన్ ప్రాక్టీస్ చేసేందుకు విదేశీ కళాశాలల ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇందుకు గానూ నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షను రాస్తున్న విద్యార్థుల్లో గత ఐదేండ్లలో కేవలం 14 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లకు భారత్‌లో వైద్యం ప్రాక్టీస్ చేసుకునేందుకుగానూ కావాల్సిన లైసెన్స్ ఇచ్చేందుకు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్(ఎఫ్‌ఎంజీఈ)ను నిర్వహిస్తారు. ఈ పరీక్షను నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్(ఎన్‌బీఈ) జరుపుతుంది. ఏడాదికి జూన్, డిసెంబర్ నెలల్లో రెండుసార్లు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఎస్‌బీఈ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. పోస్టు గ్రాడ్యుయేట్ పరీక్షల నిర్వహణ విధానంలో నిర్మాణాత్మక మార్పులు తీసుకురావడం ద్వారా మెడికల్ విద్యలో నాణ్యతను పెంచేందుకు ఈ బోర్డు పనిచేస్తోంది.