Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్ : కాశ్మీర్‌లో కురుస్తున్న దట్టమైన పొగ మంచు విమాన ప్రయాణానికి తీవ్ర అడ్డంకిగా మారింది. మంచు కారణంగా శ్రీనగర్ ఎయిర్‌పోర్టు నుంచి అన్ని విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వందలాది మంది ఎయిర్‌పోర్టులోనే వేచిచూస్తున్న దృశ్యాలు కనిపించాయి. మొత్తంగా 27 విమాన సర్వీసులను శనివారం నాడు రద్దు చేశామని, వాటిని రెండు విమానాలు సైన్యానికి చెందినవి కూడా ఉన్నాయని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. ఉదయం సమయంలో ఎయిర్‌పోర్టుకు చుట్టుపక్కల దాదాపు 600 మీటర్ల వరకూ దట్టమైన పొగ మంచు ఆవరించిందనీ, తరువాత కూడా అదే పరిస్థితి కొనసాగిందని తెలిపారు.