Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
'బాబ్రీ' కూల్చివేతపై తీర్పునకు ఎదురుచూపులు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 08,2019

'బాబ్రీ' కూల్చివేతపై తీర్పునకు ఎదురుచూపులు

- కుట్రకేసు నిందితుల్లో బీజేపీ సీనియర్లు ఎల్‌కె అద్వానీ, జోషీ, ఉమాభారతి, కళ్యాణ్‌సింగ్‌
- 2020 ఏప్రిల్‌కల్లా తీర్పు ఇవ్వాలంటూ ప్రత్యేక కోర్టును ఆదేశించిన సుప్రీంకోర్టు
లక్నో: దశాబ్దాలుగా రెండు మతాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన బాబ్రీ మసీదును 1992, డిసెంబర్‌ 6న హిందూత్వ సంస్థలకు చెందిన కరసేవకులు కూల్చివేశారు. ఇటీవలే ఆ వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందంటూ సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. అయితే, బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు నుంచి తీర్పు ఇంకా వెల్లడి కాలేదు. కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్‌జోషి, ఉమా భారతి, యూపీ మాజీసీఎం కల్యాణ్‌సింగ్‌, మాజీ ఎంపీ వినరు కటియార్‌ నిందితులుగా ఉన్నారు. అయోధ్యలోని స్థల వివాదంపై తీర్పు ఇచ్చిన సందర్భంగా మాజీ చీఫ్‌జస్టిస్‌ రంజన్‌గొగోరు నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కరసేవకులు మసీదును కూల్చి వేయడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంలో ముస్లిం వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన తర్వాత దేశంలో జరిగిన మత ఘర్షణల్లో దాదాపు 2000మంది అమాయకులు బలయ్యారు.
ఈ కేసులో ఇప్పటివరకూ ఏం జరిగింది..?
బాబ్రీ మసీదు కూల్చివేతపై 1992 డిసెంబర్‌ 6న 197 బై 92 నెంబర్‌తో స్థానిక రామజన్మభూమి పోలీస్‌ స్టేషన్‌లో మొదటి ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. గుర్తు తెలియని కరసేవకులు మసీదును కూల్చి వేసినట్టు అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత 10 నిమిషాలకు మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అందులో వీహెచ్‌పీ నేతలు విష్ణు దాల్మియా, సాథ్వి రితంబర రెచ్చగొట్టే ఉపన్యాసాలిచ్చినట్టు అభియోగాలున్నాయి. ఆ తర్వాత కొన్ని రోజుల్లో మరో 47 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. జర్నలిస్టులుసహా పలువురిపై దాడులకు సంబంధించినవి కూడా వాటిలో ఉన్నాయి. ఆ తర్వాత వీటన్నిటినీ ఒకే ఛార్జిషీట్‌లోకి సీబీఐ మార్చింది. అనుబంధంగా బీజేపీ, వీహెచ్‌పీ నేతలపై మరో ఛార్జిషీట్‌ను రూపొందించింది. మసీదు కూల్చివేత వెనుక భారీ నేరపూరిత కుట్ర ఉన్నట్టు అభియోగాలు మోపింది.
కాగా, అద్వానీసహా బీజేపీ సీనియర్‌ నేతలపై నమోదైన కుట్ర అభియోగాలను 2001లో సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టి వేసింది. ప్రత్యేక కోర్టు తీర్పును 2010లో అలహాబాద్‌ హైకోర్టు సమర్థించింది. ఆ తర్వాత లక్నో ప్రత్యేక కోర్టు ఈ కేసును రెండుగా విభజించింది. 21మంది నిందితులపై విచారణను రారుబరేలీలోని కోర్టుకు బదిలీ చేసింది. మిగతా 27మంది నిందితులపై లక్నో కోర్టు విచారణకు స్వీకరించింది. అద్వానీసహా బీజేపీ, సంఫ్‌ుపరివార్‌ నేతల రెచ్చగొట్టే ఉపన్యాసాలపై రారుబరేలీ కోర్టులో, లక్షలాది గుర్తు తెలియని కరసేవకులు మసీదును కూల్చివేసిన కేసును లక్నో కోర్టులో విచారణ చేపట్టాలన్నది ప్రణాళిక. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2011లో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2017, ఏప్రిల్‌ 19న రోజువారీ విచారణ జరపాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను రద్దు చేసింది. అద్వానీసహా సీనియర్‌ నేతలపై నేరపూరిత కుట్ర కేసులో విచారణ జరపాల్సిందేనని స్పష్టం చేసింది. రారుబరేలీ కేసును లక్నోలోని ప్రత్యేక కోర్టుకు తిరిగి బదిలీ చేసింది. 2020 ఏప్రిల్‌ వరకల్లా ఈ కేసులో తీర్పు వెల్లడించాలని ప్రత్యేక కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతో, అదే ఏడాది మే నెలలో ప్రత్యేక కోర్టు బీజేపీ నేతలపై విచారణ చేపట్టింది. ఈ కేసులో ఇప్పటి వరకు 300మంది సాక్ష్యులను ప్రత్యేక కోర్టులు ప్రశ్నించాయి. వీరిలో 50మంది మరణించారు. సాక్ష్యుల్లో పలు మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు కూడా ఉన్నారు.
జర్నలిస్టుల సాక్ష్యాలే కీలకం
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణలో జర్నలిస్టుల సాక్ష్యాలు కీలకం కానున్నాయి. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసినవారిలో బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌ విలేకరి సర్‌ విలియమ్‌ మార్క్‌ టుల్లీ ఒకరు. శిలాన్యాస్‌ పేరుతో హిందూత్వ సంస్థలకు చెందిన లక్షలాది కరసేవకులు అయోధ్యకు చేరుకున్న రోజున, అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియజేయడానికి టుల్లీ అక్కడికి చేరుకున్నారు. జైశ్రీరాం అంటూ ఆవేశపూరిత నినాదాలతో కాషాయరంగు బ్యాడ్జీలు ధరించిన కరసేవకులు మసీదువైపు తరలి వెళ్లడాన్ని ఆయన చూశారు. జరుగుతున్న ఘటనల్ని ఎప్పటికపుడు ఆయన లండన్‌లోని తమ ఆఫీస్‌కు తెలియజేశారు. మూడు వరుసల రక్షణ వలయంగా ఉన్న పోలీసులు గుంపులుగా మసీదువైపు దూసుకుపోతున్న కరసేవకుల్ని నిలువరించకుండా నిశ్చేష్టులై ఉండటాన్ని టుల్లీ గమనించారు. చివరికి మసీదు కూల్చివేత ఘటన సీన్‌ టు సీన్‌ ఎలా జరిగిందో ప్రత్యక్షంగా వీక్షించారు.
మసీదు కూల్చివేత జరిగిన 26 ఏండ్ల తర్వాత టుల్లీని సీబీఐ సంప్రదించింది. లక్నోలోని ప్రత్యేక కోర్టులో సాక్ష్యం ఇవ్వాలని కోరింది. కూల్చివేత వెనుక కుట్రకోణం ఏమైనా ఉన్నదా..? అన్న అంశంపై కోర్టు ఆయన్ని ప్రశ్నించింది. జిల్లా జడ్జి ఎస్‌కె యాదవ్‌ ముందు ఆనాడు తాను చూసిన సంఘటనల క్రమాన్ని ఆయన వివరించారు. టుల్లీ సాక్ష్యాన్ని నిందితుల తరఫు డిఫెన్స్‌ న్యాయవాది సవాల్‌ చేశారు. సంఘటన ప్రాంతంలో తాను లేనని వాదించేందుకు న్యాయవాది ప్రయత్నించారని టుల్లీ తెలిపారు. తాను ఏ హౌటల్‌లో బస చేసిందీ రుజువు చూపే బిల్లు ఉన్నదా..? ఆ హౌటల్‌ ఫోన్‌ నెంబర్‌ ఉన్నదా..? అని ప్రశ్నించారని టుల్లీ తెలిపారు. 26 ఏండ్ల క్రితంనాటి ఆధారాలు కావాలంటూ అడిగిన ఈ తుంటరి ప్రశ్నలకు ఎవరైనా ఎలా సమాధానం చెప్పగలరని జడ్జికి వివరించానని టుల్లీ తెలిపారు.
ఈ కేసులో పియొనీర్‌ ఇంగ్లీష్‌ దినపత్రిక ఫోటోగ్రాఫర్‌ ప్రవీణ్‌జైన్‌ కూడా ఓ ప్రత్యక్ష సాక్షి. తాను తీసిన ఫోటోల ఆధారంగా మసీదు కూల్చివేత వెనుక నేరపూరిత కుట్ర ఉన్నట్టు అర్థమవుతుందని జైన్‌ తెలిపారు. కూల్చివేత సమయంలో ముంబై నుంచి వెలువడే ఆన్‌లుకర్‌కు రిపోర్టర్‌గా పని చేసిన రేణూ మిట్టల్‌ కూడా ఓ ప్రత్యక్ష సాక్షి. ఆమె రెండు ప్రత్యేక కోర్టుల్లో పలుమార్లు సాక్ష్యం చెప్పినట్టు తెలిపారు. మసీదు కూల్చివేతలో ఎల్‌కె అద్వానీ పాత్రపై ఆమె సాక్ష్యం ఇచ్చారు. కరసేవకులు మసీదును కూల్చివేస్తుంటే అక్కడే ఉన్న బీజేపీ నేతలెవరూ అడ్డుకోలేదని ఆమె తెలిపారు. ఆ సమయంలో ది వీక్‌ మేగజైన్‌కు రిపోర్టర్‌గా ఉన్న దేబాశిష్‌ ముఖర్జీ కూడా ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి. సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణలో జర్నలిస్టుల సాక్ష్యాలు కీలకం కానున్నాయి. ఈ కేసులో దోషులుగా తేలిన నిందితులకు రెండు నుంచి ఐదేండ్ల వరకూ శిక్షలు పడనున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మేము సైతం
మోడీ సర్కార్‌ కు చీమకుట్టినట్టూ లేదు..
27 నగరాల్లో మెట్రో రవాణా
రండి.. చట్టాల గురించి వివరించండి....
వీఐపీల సేవలో...
దళిత యువతిపై దారుణం
అప్పటి వరకు మాల్యాను అప్పగించం!
నేనూ బాధితురాలినే!
ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లకుపార్లమెంటరీ ప్యానెల్‌ సమన్లు
సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులు
బాదుడే బాదుడు
కిసాన్‌ పరేడ్‌ అనుమతిపై మీదే అధికారం
రాజ్యసభలో జమ్మూకాశ్మీర్‌కు ప్రాతినిథ్యం జీరో
మణిపూర్‌లో ఇద్దరు జర్నలిస్టులపై దేశద్రోహం కేసు
లక్ష ట్రాక్టర్లతో కిసాన్‌ పరేడ్‌
దేశంలో ఉద్యోగ సంక్షోభం
2,24,301 మందికి కరోనా వ్యాక్సిన్‌
పెట్రో బాదుడు..
సీఎంల కమిటీ నివేదిక లేకుండానే
తొలి టీకా తీసుకున్న వ్యక్తికి అలర్జీ
కరెంటు తీగలు తగిలి బస్సు దగ్ధం..
లెఫ్ట్‌ఫ్రంట్‌, కాంగ్రెస్‌ చర్చలు
ట్రాక్టర్‌ ర్యాలీపై నేడు సుప్రీంకోర్టు విచారణ
13 ఏండ్ల బాలికపై సామూహిక లైంగికదాడి
సంగీత విద్వాంసుడు ముస్తాఫా ఖాన్‌ ఇకలేరు
అర్నబ్‌ సందేశాలపై జేపీసీ దర్యాప్తుకు విపక్షాలు డిమాండ్‌
కర్నాటకలో ఉన్న మరాఠా ప్రాంతాలను తీసేసుకుంటాం: ఉద్ధవ్‌ఠాక్రే
లేహ్‌లోని 20 మంది ఐటీబీపీ ఆరోగ్య సిబ్బందికి టీకా
జీ-7 శిఖరాగ్ర సదస్సుకు మోడీకి బ్రిటన్‌ ఆహ్వానం
త్రిపుర కాంగ్రెస్‌ చీఫ్‌ కారుపై బీజేపీ కార్యకర్తల దాడి

తాజా వార్తలు

04:12 PM

చిత్తూరులో యువతిని దారుణంగా..

04:12 PM

వంట గ్యాస్ లీకై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు

04:02 PM

గవాస్కర్ రికార్డును తిరగరాసిన శుభమన్ గిల్..

03:51 PM

బీజేపీ మళ్లీ డిపాజిట్ కోల్పోతుంది : ఉత్తమ్ కుమార్

03:38 PM

మోడీ ఫొటో లేదని..

03:37 PM

గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి..

03:20 PM

టీమిండియాకు కేసీఆర్, కేటీఆర్ అభినందనలు..

03:16 PM

సాగు చట్టాలు..వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయి : రాహుల్ గాంధీ

03:07 PM

అనుమానించిన వాళ్లంతా ఒక్క‌సారి ఈ విజ‌యాన్ని చూడండి : కోహ్లీ

03:03 PM

ఘోర విషాదం.. రెండు కార్లు ఢీ

02:46 PM

నిప్పంటించుకొని మహిళా పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

02:32 PM

పంజాగుట్టలో వాహనం ఢీకొని జీహెచ్ఎంసీ కార్మికురాలు మృతి

02:13 PM

టీమిండియాకు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానా

02:06 PM

మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించిన కేసీఆర్

01:57 PM

వాహనదారులకు గమనిక.. ఓఆర్ఆర్‌పై కొత్త ట్రాఫిక్ రూల్స్..

01:52 PM

రోడ్డు ప్రమాదంలో పెండ్లి కుమార్తె సహా ..3గురు మృతి

01:49 PM

బావిలో పడ్డ చిరుతను రక్షించిన అధికారులు

01:46 PM

దొరస్వామిరాజు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం

01:34 PM

ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం..

01:29 PM

కామారెడ్డిలో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

01:22 PM

గ్యాస్ సిలిండర్ తేలేదని భర్తను సోదరుడితో కొట్టించిన భార్య..

01:09 PM

ప‌రాక్ర‌మ్ దివ‌స్‌గా నేతాజీ జయంతి

01:03 PM

ఆస్పత్రి నుండి డిశ్చార్జి అయిన కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్

12:58 PM

సినీన‌టుడు క‌మ‌ల‌హాస‌న్ కాలికి శస్త్ర‌ చికిత్స

12:40 PM

మెట్రో స్టేషన్​లో ఒక్కసారిగా కుప్పకూలిన ప్రయాణీకుడు..

12:31 PM

ఉపకులం వేరంటూ ప్రేమజంటకు జ‌రిమానా

12:31 PM

హైద‌రాబాద్‌లో సోనూసూద్ అంబులెన్స్ స‌ర్వీస్ ప్రారంభం

12:25 PM

వరంగల్ జిల్లాలో కొట్టుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు..

12:17 PM

క్రెడిట్ కార్డు కస్టమర్లకు శుభవార్త

12:17 PM

ప్రముఖ క్యాన్సర్​ వైద్య నిపుణులు శాంత కన్నుమూత..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.