Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 67లక్షలమంది మలేరియా బారినపడ్డారు : ప్రపంచ మలేరియా నివేదిక-2019 విడుదల
- ఇండియాలో తగ్గని మలేరియా మరణాలు
- మన దేశం నుంచి 58శాతం కేసులు
- అధికారికంగా 4 లక్షల కేసులు నమోదు!
న్యూఢిల్లీ : పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాలతో పోల్చుకుంటే, ఇండియాలో మలేరియా బారిన పడి మరణిస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉందని తేలింది. 2018లో 67లక్షలమంది మలేరియా బారినపడ్డారనీ, కానీ అధికారంగా ఆస్పత్రుల్లో 4లక్షల కేసులు నమోదయ్యాయనీ 'ప్రపంచ మలేరియా నివేదిక-2019' వెల్లడించింది. ముఖ్యంగా ఆగేయాసియా దేశాల్లో మలేరియా మరణాల సంఖ్య ఇండియాలో(58శాతం) ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. ఇండియా తర్వాత ఇండోనేషియా(21శాతం), మయన్మార్(12శాతం) దేశాల్లో మలేరియా కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్నాయి. వైద్యరంగానికి ప్రభుత్వ కేటాయింపులు తగ్గటం, సరైన చికిత్స అందుబాటులో లేకపోవటం మరణాల సంఖ్యను పెంచిందని నివేదిక అభిప్రాయపడింది.
2018 ఏడాదికి సంబంధించి ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) రూపొందించిన ఈ నివేదికలోని మరికొన్ని విషయాలు ఇలా ఉన్నాయి... మలేరియా ప్రధానంగా దోమకాటుతో వస్తుందన్న విషయం తెలిసిందే. దోమ కుట్టినప్పుడు ప్లాస్మోడియం ఫాల్సిపారం లేదా ప్లాస్మోడియం వివాక్స్ అనే వైరస్‌లు మనిషి రక్తంలోకి ప్రవేశిస్తా యి. దీంతో ఎర్ర రక్త కణాల్లో మార్పు చోటుచేసుకోవటం, కాలేయం పనితీరు దెబ్బతినటం జరు గుతాయి. వాంతులు, తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొ ప్పులు, కామెర్లకు దారితీస్తుంది. సమయానికి వైద్య చికిత్స అందకపోతే రోగి కోమాలోకి వెళ్లి, మరణానికి దగ్గరవుతాడు. ఇండియాలో నమో దైన కేసుల్లో ప్లాస్మోడియం వివాక్స్ వైరస్ ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా 75 లక్షల మలేరియా కేసుల్లోనూ ఇదే రకమైన వైరస్ ఉన్నట్టు గుర్తించారు.
అధికారంగా 4 లక్షల కేసులు నమోదు!
- ఆగేయాసియా దేశాల్లో నమోదైన మొత్తం మలేరియా కేసుల్లో 98 శాతం కేసులు ఇండియా, ఇండోనేషియా, మయన్మార్ నుంచి నమోదయ్యాయి.
- ఆగేయాసియా ప్రాంతంలో మలేరియా మరణాలు ఇండియాలో (58శాతం) అత్యధికంగా ఉన్నాయి.
- ఇండియాలో 67లక్షల మంది మలేరియా బారినపడినట్టు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తించింది. కానీ ఇందులో 4లక్షల కేసులు హాస్పిటల్స్‌లో నమోదయ్యాయి.
ఆ 20 దేశాల్లో...ఇండియా సబ్ సహారా ఆఫ్రికాలోని 19 దేశాల్లో, ఇండియాలో మలేరియా మరణాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాల్లో 85.2శాతం ఈ 20 దేశాల్లో చోటుచేసుకున్నాయి. మొత్తం మరణాల్లో 24శాతం నైజీరియాలో ఉండ టం గమనార్హం. ఆ తర్వాత అత్యధికంగా డిఆర్ కాంగో(11శాతం), యూఆర్ టాంజానియా(5శాతం), ఆంగోలా(4శాతం), మొజాంబిక్(4శాతం) ఉన్నాయి.