Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ ఆర్ధిక పరిస్థితి బలహీనంగా చోటు చేసుకోవడంతో పన్ను వసూళ్లు అత్యంత పేలవంగా చోటు చేసుకుంటున్నాయి. బడ్జెట్ అంచనాలతో పోల్చితే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలో జీఎస్టీ వసూల్లు కేంద్రాన్ని నిరాశపర్చాయి. గడిచిన ఏప్రిల్-నవంబర్ కాలంలో రూ.3,28,365 కోట్ల వస్తు సేవల పన్నులు (జీఎస్టీ) నమోదయ్యాయని సోమవారం కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోకసభకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ కాలంలో రూ.5,26,000 కోట్ల పన్ను వసూళ్లు చేయాలని కేంద్రం నిర్దేశించుకుందన్నారు. 2018-19లో రూ.4,57,534 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఆ ఏడాదిలో రూ.6,03,900 కోట్ల లక్ష్యం పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. 2019-20 అక్టోబర్ నాటికి 999 జీఎస్టీ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా పన్ను ఎగవేసిన రూ.8,134.39 కోట్లు రికవరీ అయ్యాయని వెల్లడించారు.
2018-19లో 1,473 కేసుల్లో రూ.19,395.26 కోట్ల జీఎస్టీ వసూళ్లు చేసినట్టు తెలిపారు. 2017-18లో 148 కేసుల్లో రూ.757.81 కోట్లు రికవరీ చేశామన్నారు. పన్ను ఎగవేతలను అరికట్టడానికి వ్యవస్థను పటిష్టం చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం టెక్నలాజీని మరింత ఉపయోగించుకోనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎనలిటిక్స్ అండ్ రిస్కు మేనేజ్‌మెంట్ (డీజీఏఆర్‌ఎం)ని సీబీఐసీ ఏర్పాటు చేసిందన్నారు. అదే విధంగా వస్తు సరఫరాపై మరింత నిఘా వేయడానికి ఈ-వే బిల్ స్వాడ్స్‌ను అప్రమత్తం చేయనన్నట్లు తెలిపారు. ఇన్‌్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ఎగవేతలను దృష్టిలో పెట్టుకుని పన్ను చెల్లింపుదారులకు గరిష్టంగా 20 శాతానికి అర్హత క్రెడిట్‌ను మించకుండా చేసినట్టు తెలిపారు. రెవెన్యూ లోటుతో సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు కేంద్రం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే జీఎస్టీని పునర్‌వ్యవస్థీకరించి పన్ను రేటును పెంచాలనే యోచనలో ఉంది. ప్రస్తుతమున్న 5శాతం శ్లాబును 6 శాతానికి పెంచే అవకాశమున్నట్టు ఇది వరకే పలు రిపోర్టులు వచ్చాయి. ప్రస్తుతం నిత్యావసరాలకు సంబంధించిన చాలా వస్తువులు 5 శాతం శ్లాబులోనే ఉన్నాయి. జీఎస్టీ వసూళ్లలో దాదాపు 5శాతం ఆదాయం ఈ శ్లాబు ద్వారానే వస్తోంది. ఈ నెల 18న జరిగే జీఎస్టీ ప్యానల్ సమావేశం గత కొన్ని నెలలుగా తగ్గుతూ వస్తున్న జీఎస్టీ వసూళ్లు నవంబరులో మాత్రం కాస్త పెరిగి.. రూ. లక్ష కోట్లు దాటి రూ. 1.03లక్షల కోట్లుగా నమోదయిన సంగతి తెలిసిందే.