Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిటిజన్‌షిప్ సవరణ బిల్లుపై సీపీఐ(ఎం) మూడు సవరణలులౌకిక దేశాన్ని హిందూ మత రాజ్యంగా మార్చొద్దని సీపీఐ(ఎం) ఎంపీ ఏఎం ఆరీఫ్ కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. దేశంలో నెలకొన్న ఆర్థిక తిరోగమనం, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఉద్యమిస్తు న్నారని చెప్పారు. దాన్నుంచి ప్రజల్ని పక్కదోవ పట్టించేందుకు మోడీ సర్కార్ కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. అందుకోసమే ఇలాంటి సున్నితమైన అంశాలను తెరపైకి తీసుకొస్తుందన్నారు. అసలైన ప్రజా సమస్యలపై చర్చ జరగటం లేదని సభలో వెల్లడించారు. ప్రజాస్వామ్య, లౌకిక దేశాన్ని, మత దేశంగా మార్చొద్దని వేడుకుంటునని అన్నారు. ఇక్కడ మతం పేరుతో ప్రజల్ని విభజించొద్దని సూచించారు. బీజేపీ మత విధానాల్లో భాగమే ఈ బిల్లు అనీ, అందువల్ల ఈ బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టంచేశారు. లోక్‌సభలో బిల్లుపై జరిగిన చర్చలో సీపీఐ(ఎం) తరఫున ఏఎం ఆరీఫ్ మాట్లాడారు. మోడీ సర్కార్ మతం ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వా లని తీసుకొచ్చిన ఈ బిల్లు చాలా ప్రమాదకరమని విమర్శించారు. రాజ్యాంగ మూల సూత్రాలను విస్మరించారనీ, ఇది జాతి వ్యతిరేక బిల్లు అని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ సూత్రాలకు విఘాతం కలిగించే బిల్లు తేవడం దారుణమన్నారు. రాజ్యాంగంలో కుల, మత, ప్రాంత, భాష ప్రాతిపదికగా సమానత్వం పేర్కొందన్నారు. అయితే, ఆ విషయాన్ని ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ప్రధాని మోడీ పార్ల మెంట్ ఉమ్మడి సమావేశంలో మాట్లాడుతూ నారాయణ గురు గురించి మాట్లాడారు. కానీ చెప్పిన వాటిని పాటించాల్సి ఉన్నదనీ, కానీ ప్రస్తుత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. నారా యణ గురుకుల, మత, ప్రాంతాల ప్రాతిపదికన కాకుండా, మానవత్వం ప్రాతిపదికన ఉండాలన్నారు. ఈ బిల్లు లౌకికవాదానికి వ్యతిరేకంగా ఉన్న దనీ, అందువల్ల తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాజ్యాంగ నిర్మాణం సూత్రాలకు వ్యతిరేకంగా బిల్లు ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 5, 25, 49 తదితర ఆర్టికల్స్‌ను ఉల్లంఘించిందని విమర్శించారు. ప్రతిపక్ష సభ్యులంతా మాట్లాడే సందర్భంగా రాజ్యాంగ విలువలు గురించి వివరిం చారని తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందినా, న్యాయ విచారణకు వెళ్తే కోర్టులో భంగపాటు తప్పదని హెచ్చరించారు. దేశ ఐక్యత ప్రమాదంలో పడిందని అన్నారు. దేశ విభజన సమయంలో మహాత్మ గాంధీ ''దేశ విభజన అయితే, నా గుండె రెండు అవుతుంది'' అని పేర్కొన్న అంశాలను గుర్తు చేసుకోవాలన్నారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం సిటిజన్‌షిప్ సవరణ బిల్లుతో దేశాన్ని విభజిస్తుందని విమర్శించారు.
సిటిజన్‌షిప్ సవరణ బిల్లుపై సీపీఐ(ఎం) మూడు సవరణలు
సిటిజన్‌షిప్ సవరణ బిల్లుపై సీపీఐ(ఎం) మూడు సవరణలు ప్రతిపాదించింది. సోమవారం బిల్లుపై లోక్‌సభలో చర్చ ముగిసిన తరువాత సీపీఐ(ఎం) లోక్‌సభ పక్షనేత పీఆర్ నటరాజన్ మూడు సవరణలు ప్రతిపాదించారు. బిల్లులోని రెండో క్లాజ్‌లో పేర్కొన్న సరిహద్దు దేశాలైన ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి దేశంలోకి వచ్చిన హిందూ, సిక్కు, బుద్ధిస్టు, జైన్, పార్శీ, క్రిస్టియన్స్ వర్గాలకు అనేదాన్ని డిలీట్ చేయాలనీ, క్లాజ్ 3లో సెక్షన్ 6బీ, సబ్ సెక్షన్ 4లో పేర్కొన్న 34 నుంచి 37 వరకు ఉన్న అసోం, ఈశాన్య రాష్ట్రాలకు అప్లై చేయకూడదనీ, క్లాజ్ 6లో పేర్కొన్న మతాల పేరుతో పౌరసత్వాన్ని ఆపాలని సవరణలు ప్రవేశపెట్టారు.