Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమిస్టర్ పరీక్షల్ని వాయిదావేయండి..
- హెచ్‌ఆర్‌డీ అధికారులతో జేఎన్‌యూ విద్యార్థి సంఘం
న్యూఢిల్లీ : హాస్టల్ ఫీజుల పెంపు, సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌పై కేంద్రం తన నిర్ణయాల్ని మార్చుకోవాలని 'జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ' విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) డిమాండ్ చేసింది. వర్సిటీలో చివరి సెమిస్టర్ పరీక్షలను వాయిదావేయాలని విద్యార్థి సంఘం నాయుకులు కోరుతున్నారు. కేంద్ర మానవ వనరుల అధికారులతో మంగళవారం జరిగిన సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు తమ డిమాండ్లను మరోసారి విన్నవించారు. జేఎన్‌యూ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ధోరణి, ప్రభుత్వ విద్యను దెబ్బతీసేలా ఉందని గతకొన్నిరోజులుగా జేఎన్‌యూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. హాస్టల్ ఫీజు పెంపు, ఇతర నిర్ణయాల పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడింది. జేఎన్‌యూ విద్యార్థులంతా ఓవైపు పోరాడుతుంటే, మరోవైపు హడావిడిగా సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడానికి వర్సిటీ యాజమాన్యం సిద్ధమైంది. చివరి సెమిస్టర్ పరీక్షలు డిసెంబరు 12 నుంచి నిర్వహించడాన్ని విద్యార్థి సంఘాలు తప్పుబడుతున్నాయి. తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నాయి. దీనిపై సానుకూలంగా స్పందిస్తామని విద్యార్థి సంఘం నాయకులకు హెచ్‌ఆర్‌డీ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని సమాచారం.