Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్లలను బలవంతంగా వెట్టిచాకిరీ చేయిస్తున్నారు: ఎన్సీఆర్బీ
- బీహార్‌లో 121 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనా..
న్యూఢిల్లీ: పిల్లల అక్రమ రవాణా కేసుల్లో రాజస్థాన్ టాప్ ప్లేస్‌లో నిలువగా, పశ్చిమ బెంగాల్, బీహా ర్‌లు తరువాత స్థానం లో ఉన్నాయి. ఈ విష యం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ద్వారా స్పష్టమైంది. ఈ నివేదిక ప్రకారం.. రాజస్థాన్‌లో అత్యధికంగా 886 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 450 కేసులు నమోద య్యాయి. అలాగే బీహార్‌లో 121 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనప్పటికీ.. ఒక్క దానిలో కూడా చార్జిషీట్ దాఖలు చేయలేకపోయారనీ, తద్వారా అక్రమ రవాణా కేసుల్లో ఏ నిందితుడినీ శిక్షించలేదని పేర్కొంది. బీహార్‌లో 395 మంది బాలలు అక్రమ రవాణాకు గురి కాగా, వారిలో 362 మంది బాలురు, 33 మంది బాలికలు ఉన్నారు. ఇందులో 366 మంది పిల్లలను బలవంతంగా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని తెలిపింది.
దీనిపై బీహార్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సీఐడీ) వినయ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆన్‌లైన్ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్‌ను అమలు చేయడానికి కృషి జరుగుతోందని తెలిపారు. బాధితులు ఎఫ్‌ఐఆర్ నమో దు చేసినా.. బెది రింపులతో కేసులను వెనక్కి తీసుకుం టున్నారని తెలిపారు.
స్వచ్ఛంద సంస్థ (ఎన్జీఓ) కార్యకర్త సురేష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదరికం, నిరక్షరాస్యత వల్లే పిల్లలు అక్రమ రవాణాకు గురవుతున్నారని తెలిపారు. 2014లో జైపూర్ నుంచి 500 మంది పిల్లలను రక్షించి, పునరావాసం కల్పించామని తెలిపారు. ఈ కేసులలో ప్రాసిక్యూషన్ చాలా బలహీనంగా ఉందనీ, కేసుల సమన్వయం కోసం సరైన యంత్రాంగం లేదని తెలిపారు. చపిల్లల అక్రమ రవాణాకేసులో రాజస్థాన్ టాప్