Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాఠీచార్జిని ఖండించిన వామపక్ష విద్యార్థి సంఘాలు
- ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో:
బీజేపీ సర్కారు విద్యా వ్యతిరేక విధానాలను సమిష్టి పోరాటాలతో ఎదుర్కొంటామనీ, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను కాపాడుకుంటామి ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తున్నప్పటికీ.. పోలీసులు దాష్టీకం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ''ఫీజ్ మస్ట్ ఫాల్'' పేరిట హాస్‌ట్యాగ్‌తో సామాజిక ఉద్యమం ప్రారంభిం చినట్టు వివరించారు. జేఎన్‌యూలో ఫీజుల పెంపుపై అన్నిరకాలుగా పోరాటం చేసేందుకు సన్నద్ధం అయినట్టు వివరించారు. విద్యా రంగంపై మోడీ సర్కారు ప్రణాళిక ప్రకారమే దాడి చేస్తుందని మండిపడ్డారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసులు సోమవారం జరిపిన లాఠీచార్జిని ఖండిస్తూ ఢిల్లీలోని ప్రెస్‌క్లబ్‌లో అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు మీడియా సమా వేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న బిశ్వాస్ మాట్లాడుతూ... జేఎన్‌యూ ట్యాక్స్ పేయర్స్ తో నడుస్తుందని ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు విమర్శిస్తున్నారని... మరి ప్రభుత్వం పన్నులతో నడ వటం లేదా? అని నిలదీశారు. తాము ఫీజుల పెంపు అంశంపై న్యాయపరంగా, శాంతియుతంగా పోరాడుతున్నట్టు వివరించారు. ఐఐటీ, ఐఐఎం, రాష్ట్ర వర్సిటీ, కేంద్ర విశ్వవిద్యాలయాల అన్నింటిలో కేంద్ర ప్రభుత్వం సుమారు 1000 శాతం ఫీజుల పెంచిందని వివరించారు. ఇందుకు నిరసనగానే తాము ఐక్యంగా పోరాడుతున్నట్టు చెప్పారు. జేఎన్ యూఎస్‌యూ సంఘం అధ్యక్షురాలు ఐషీఘోష్ మాట్లాడుతూ... ఫీజులపై తాము పోరాడుతుంటే... ప్రభుత్వం, వర్సిటీ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షుడు ఎన్ సాయి బాలాజీ మాట్లాడుతూ... కేంద్ర విద్యా విధానంతో పేదలకి విద్యని దూరం చేయడమే కాకుండా పూర్తిగా కాషాయీకరణ చేసేందుకు యత్నిస్తున్నట్టు విమర్శించారు. దేశంతో పాటు జేఎన్‌యూలో కూడా ప్రజాస్వామ్యయుతమైన వాతావరణం లేదని వివరించారు. కాగా, ఈ మీడియా సమావేశంలో వీక్కి మహేశ్వరీ(ఏఐఎస్‌ఎఫ్), సలాం ఇంతియాజ్(ఏఎమ్‌యూఎస్‌యూ),వికాస్ యాదద్(ఎన్‌ఎస్‌యూఐ), దిగ్విజరు సింగ్ (సమాజ్‌వాదీ విద్యార్థి సంఘం) పాల్గొన్నారు.