Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీలో మిన్నంటిన నిరసనలు
అమరావతి: పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా ఏపీరాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం ఆందోళనలకు దిగింది. వామపక్షాల పిలుపు మేరకు బుధవారం అన్ని జిల్లాలోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలతో జిల్లా కేంద్రాలు మారుమో గాయి. వీటి ప్రతిధ్వనులు అసెంబ్లీలోనూ వినిపించాయి. శాసనమండలి, సభల్లో అధిక ధరల అంశం ప్రస్తావనకు వచ్చింది. పెంచిన ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాలు ఉభయ సభల్లోనూ తిరస్కరణకు గురయాయి. దీంతో శాసనసభ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. చర్చకు పట్టుబట్టడంతో శాసనమండలి ఏకంగా ఐదుసార్లు వాయిదా పడింది.
పొడియం వద్ద నినాదాలు
ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపవద్దంటూ టీడీపీ సభ్యులు శాసనసభలో పోడియం వద్దకు దూసుకువెళ్లి నినాదాలు చేశారు. ఈ అంశంపై తక్షణమే చర్చను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని పట్టుపట్టారు. దీనికి అధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం నిరాకరించారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తు న్నట్టు ప్రకటించారు. ఆర్టీసీపై ప్రత్యేక చర్చ జరుగుతున్నదనీ, దానిలో ఈ విషయాన్ని ప్రస్తావించాలని ఆయన సూచించారు.