Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జబల్‌పూర్ : బీజేపీకి చెందిన వివాదాస్పద ఎంపీ ప్రజ్ఞా సింగ్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. తన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ అర్హతను ప్రశ్నిస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజ్ఞా సింగ్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ అదే ప్రాంతానికి చెందిన జర్నలిస్టు రాకేష్ దీక్షిత్ పిల్ దాఖలు చేశారు. ప్రచారం సమయంలో ఆమె నిబంధనలను ఉల్లంఘించారనీ, మతపరమైన అంశాలను ప్రస్తావించారని రాకేష్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రచారంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 123కు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా న్యాయస్థానానికి సమర్పించారు. దీనిపై ప్రజ్ఞాసింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు గతనెల 30వ తేదీన విచారణ జరిపింది. తాజాగా ప్రజ్ఞా సింగ్ దాఖలుచేసిన పిల్‌ను కొట్టేస్తూ జస్టిస్ విశాల్ నిర్ణయం తీసుకున్నారు.