Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రస్తుత విద్యాసంవత్సరం (2018-19)లో దాదాపు 1.7లక్షలమంది అభ్యర్థులు వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ చేయడానికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియెల్ తెలిపారు. రాజ్యసభ సమావేశాల్లో అడిగిన ఓ ప్రశ్నకు రమేశ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. 15,941 మంది విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీల్లో చేరారని పేర్కొన్నారు. అదేవిధంగా 6,20,156 మంది అభ్యర్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లినట్టు తెలిపారు. ఈ సంఖ్య గత విద్యాసంవత్సరం (2017-19)తో పోల్చితే ఈ ఏడాది తగ్గిందని వెల్లడించారు. మొత్తం అభ్యర్థులలో అత్యధికంగా కెనడా, యూఎస్, యూకే, రష్యా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకే ఉన్నత విద్య కోసం వెళ్లారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన 'ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయ్యర్ ఎడ్యూకేషన్' (ఏఐఎస్‌హెచ్‌ఈ) సెప్టెంబర్ వెల్లడించిన ఓ నివేదికను సమర్పించారు. ఈ నివేదిక అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు, వారు ఎంచుకున్న కోర్సుల వివరాలను ఖచ్ఛితత్వంతో అందిస్తుంది.