Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 రాష్ట్రాల్లో కమిషన్లున్నా చైర్‌పర్సన్లు లేరు
- 3 రాష్ట్రాల్లో కమిషన్లే లేవు
- 23 రాష్ట్రాల్లో 19 లక్షల ఫిర్యాదులు : ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా నివేదిక
న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో మానవ హక్కుల కమిషన్లు (ఎస్‌హెచ్ ఆర్‌సీలు) తీవ్ర సిబ్బంది కొరతతో ఏమాత్రం పని చేయలేని స్థితిలో ఉన్నాయి. 10 రాష్ట్రాల్లో చైర్‌పర్సన్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. మూడు రాష్ట్రాల్లో ఇంకా కమిషన్ల ఏర్పాటే జరగలేదు. రెండు రాష్ట్రాల్లో పని లేకుండా ఉన్నాయి. 13రాష్ట్రాల్లో మాత్రమే చైర్‌పర్సన్ల నియా మకం జరిగింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా(టీఐఐ) అనే స్వచ్ఛంద సంస్థ సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కింద కమిషన్ల నుంచి పలు వివరాలు సేకరించి నివేదికను రూపొందించింది. నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, జార్ఖండ్, మహారాష్ట్ర మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో చైర్‌పర్సన్లను నియమించలేదు. హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణలోని కమిషన్లు పని చేయడంలేదు. 23 రాష్ట్రాల్లోని కమిషన్లకు 48 జ్యుడిషియల్, నాన్ జ్యుడిషియల్ పోస్టుల్ని మంజూరు చేయగా, 16 ఖాళీలున్నాయి. ఆంధ్రప్రదేశ్, గోవాల్లో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తమ్మీద కమిషన్ల పాలనా విభాగాలకు మంజూరైన పోస్టుల్లో 286 ఖాళీగా ఉన్నాయి. చాలా రాష్ట్రాలు వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి.
చైర్‌పర్సన్లు లేని రాష్ట్రాల్లో మానవ హక్కుల కమిషన్లు పని చేయడంలేదు. చైర్‌పర్సన్ లేని ఛత్తీస్‌గఢ్‌లో ఇదే పరిస్థితి. ఇక్కడ మరో పోస్టు ఖాళీగా ఉన్నది. ఒక్క సభ్యుడి నియామకం మాత్రమే జరిగింది. గుజరాత్‌లో ఓ పోస్టు ఖాళీగా ఉన్నది. ఉత్తర్‌ప్రదేశ్, బెంగాల్‌ల్లో రెండు పోస్టుల చొప్పున ఖాళీలున్నాయి. ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయాల్లో ఒక్కో పోస్టు చొప్పున ఖాళీలున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం, నాగాల్యాండ్‌ల్లో ఇంకా కమిషన్లే ఏర్పాటు కాలేదు.
చైర్‌పర్సన్, సభ్యుల ఖాళీలేగాక పాలనా విభాగాల్లోనూ ఖాళీలు అధికంగానే ఉన్నాయి. బీహార్‌లో 41, యూపీలో 40, ఒడిషాలో 26, ఆంధ్రప్రదేశ్‌లో 24, తమిళనాడులో 23, బెంగాల్‌లో 22, గుజరాత్‌లో 18, మహారాష్ట్రలో 16, గోవాలో 11, హర్యానాలో 10, జార్ఖండ్‌లో 9, రాజస్థాన్‌లో 8, అసోంలో 2, మణిపూర్‌లో 2, కేరళలో ఒకటి ఖాళీగా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్, కర్నాటక,మధ్యప్రదేశ్,త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల కమిషన్ల నుంచి పాలనా విభాగం పోస్టుల వివరాలు ఇవ్వలేదు.
మానవ హక్కుల సంరక్షణ చట్టం-1993 కింద జాతీయ స్థాయిలో, రాష్ట్రాల్లో కమిషన్ల ఏర్పాటు జరిగింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీలోనూ ఓ సభ్యుని పోస్టు ఖాళీగా ఉన్నది. పాలనా విభాగం వివరాలు ఇవ్వలేదు. పౌరుల ఆత్మగౌరవం, హుందాతనానికి రక్షణ కల్పించేందుకు మానవ హక్కుల చట్టం తెచ్చారని టీఐఐ కార్యనిర్వాహక డైరెక్టర్ రామ్‌నాథ్‌ఝా అన్నారు. ప్రగతిశీల మార్పులకు ఈ చట్టం ఊతం ఇస్తుందని ఆయన అన్నారు. ఈ చట్టం దేశానికి మైలురాయి లాంటిదన్నారు. కమిషన్ల పోస్టులు ఖాళీగా ఉన్నపుడు పౌర హక్కుల రక్షణ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
నివేదిక ప్రకారం ఇప్పటి వరకూ 23 ఎస్‌హెచ్‌ఆర్‌సీలకు మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి 19 లక్షల ఫిర్యాదులు అందాయి. అత్యధికంగా(2002 నుంచి 2019 వరకు) ఉత్తర్‌ప్రదేశ్‌లో 3,60,597, పంజాబ్‌లో (1997 నుంచి 2019 వరకు) 2,69,057, మధ్యప్రదేశ్‌లో (1996 నుంచి 2016 వరకు) 2,41,073, తమిళనాడులో (1997 నుంచి 2019 వరకు) 1,92,578, ఆంధ్రప్రదేశ్‌లో 2005 నుంచి 2019 వరకు 1,45,135 ఫిర్యాదులందాయి.
24 ఏండ్లలో..లాకప్ మరణాల కేసులు 31,845
పంజాబ్ నెంబర్ వన్ 1860
ఎన్‌హెచ్‌ఆర్‌సీకి 1993 నుంచి 2017 వరకు 16,62,519 మానవ హక్కుల ఉల్లంఘన ఫిర్యాదులందగా, 22,043 పెండింగ్‌లో ఉన్నాయి. 31,845 లాకప్‌డెత్ కేసుల్ని కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సీ నమోదు చేసింది. నమోదైన కేసుల్లో పంజాబ్ నుంచి 1860, బెంగాల్‌లో 1718, బీహార్‌లో 1266, అసోంలో 1118, తమిళనాడులో 843, రాజస్థాన్‌లో 629, గుజరాత్‌లో 629, ఆంధ్రప్రదేశ్‌లో 391, మధ్యప్రదేశ్‌లో 326, కేరళలో 129, ఉత్తరాఖండ్‌లో 110, హర్యానాలో 89, గోవాలో 15, త్రిపురలో 2, మణిపూర్‌లో ఒకటి నమోదైంది. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కర్నాటక, మేఘాలయ, ఒడిషా, సిక్కిం రాష్ట్రాలు వివరాలు ఇవ్వలేదు. నమోదైన కేసుల్లో కొన్ని మాత్రమే సుమోటోగా స్వీకరించి విచారించినవి. వీటిలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరించినవి 1067...