Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శబరిమలలోకి మహిళల ప్రవేశంపై 'సుప్రీం' వ్యాఖ్య
న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి ప్రవేశించే మహిళలకు రక్షణ కల్పించాల్సిందిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఇద్దరు మహిళలు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే తోసిపుచ్చారు. శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన అంశాన్ని ప్రత్యేక విస్తృత ధర్మాసనానికి బదిలీచేసిన క్రమంలో తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమనీ, కొంత కాలంపాటు ఓపిక పట్టాలని సూచించారు. త్వరలోనే విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నదనీ, ఈ సమయంలో తాము ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేమని జస్టిస్ బాబ్డే స్పష్టం చేశారు. కాగా, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన బిందు అమ్మాని, రెహనా ఫాతిమాకు పోలీసులు రక్షణ కల్పించాలని ఆదేశించారు. శబరిమల రివ్యూ పిటిషన్లపై త్వరలోనే విస్తత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామనీ, మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పుపై ఎటువంటి స్టే లేదని సీజేఐ తెలిపారు. తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను ఏడుగురు సభ్యుల ధర్మాసనం పరిశీలిస్తుందని చెప్పారు. కాగా, అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి ప్రవేశించొచ్చంటూ 2018లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లోనే బిందు అమ్మాని, ఫాతిమాలు ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించ గా వారిపై పెప్పర్ స్ప్రేతో కొందరు దాడి చేశారు. దీంతో మహిళలకు రక్షణ కల్పించాల్సిందిగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.