Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దానికంటే మంచి వ్యవస్థలవైపు బీజేపీ చూపు: నిజామాబాద్ ఎంపీ అరవింద్
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
పసుపు బోర్డు లేనట్టేనని బీజేపీ ఎంపీ ధర్మపురి వెల్లడించారు. పసుపు రైతుల కోసం కొత్త పథకాలు వచ్చాయనీ, ఎగుమతులను ప్రోత్సహించేలా కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని బోర్డులు నిర్వీర్యం చెందుతున్నాయనీ, టీ,కాఫీ, స్పైసెస్ బోర్డులు వైఫల్యం చెందాయని ఆయన గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో అంబా సిడర్ కారు కావాలనుకుంటారా ? హొండా కారు కావాల నుకుంటారా? అని ఈ అంశాన్ని ఉటంకించా రు.ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫర్ ఎక్స్‌పోర్ట్స్ పథకం వచ్చిం దనీ... కోట్ల రూపాయల ఫండింగ్ ఉన్నదన్నారు. క్లస్టర్స్ వచ్చాయని గుర్తు చేశారు. బోర్డు చేయాల్సిన పనికి మించి న వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఇక పసుపు రైతులకు బోర్డు లేనట్టేనా..? అని మీడియా అడిగిన ప్రశ్నకు మిర్చి రైతులు ఇబ్బందులు పడితే వరంగల్ లో చిన్న ఆఫీస్ పెట్టారనీ... బోర్డు కూడా అంతేనని స్పష్టంచేశారు. బోర్డు కంటే పెద్ద వ్యవస్థని ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నట్టు వివరించారు. అనుకున్న సమయం కన్నా కొంత ఆలస్యమై నా... ఏ అంశాన్ని అంత తొందరగా వదిలిపెట్టే వ్యక్తిత్తం తనదిని కాదని చెప్పుకొచ్చారు. ఇప్పటికే నిజామాబాద్, జగిత్యాల్ జిల్లాలను పసుపు క్లస్టర్ ప్రాంతాలుగా గుర్తించబడ్డాయన్నారు.