Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఎన్‌యూ ఆందోళకారులపై వర్సిటీ వివరణ
- ఢిల్లీ హైకోర్టు విస్మయం
న్యూఢిల్లీ : హాస్టల్ ఫీజుల పెంపుపై నిరసన చేపట్టిన విద్యార్థుల వివరాలు తెలియవంటూ జేఎన్‌యూ యాజమాన్యం పేర్కొనడం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో పిటిషన్‌లో పేర్కొన్న విద్యార్థుల వివరాలు, వారు అభ్యసించే కోర్సులు, క్యాంపస్‌లో బసచేసిన నాటి వివరాలను యథాతథంగా అందించాలని జస్టిస్ ఎకె. చావ్లా జేఎన్‌యూను ఆదేశించారు. ఈ పిటిషన్‌పై వచ్చే శుక్రవారం విచారణ చేపడతామని అన్నారు. ఫీజుల పెంపుపై ఆందోళన చేపట్టిన విద్యార్థులపై జేఎన్‌యూ కక్షపూరిత చర్యలకు పాల్పడింది. పరిపాలనా భవనానికి వంద మీటర్ల పరిధిలో విద్యార్థులు ఎటువంటి నిరసన ప్రదర్శనలు చేపట్టకూడదన్న హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిం చారంటూ వారిపై కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసింది.