Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పౌరసత్వ సెగలు.. పెల్లుబికిన ప్రజాగ్రహం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 14,2019

పౌరసత్వ సెగలు.. పెల్లుబికిన ప్రజాగ్రహం

- అసోం, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్‌లలో ఉద్రిక్తత
ప.బెంగాల్‌లో రైల్వేస్టేషన్‌,
- ఇతర భవనాలకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
- షిల్లాంగ్‌లో నిరసనకారులపైకి కాల్పులు, టియర్‌గ్యాస్‌
- ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి
- కేంద్ర హోమంత్రి అమిత్‌షా పర్యటన రద్దు
- జపాన్‌ ప్రధాని, బంగ్లాదేశ్‌ మంత్రుల భారత్‌ పర్యటన క్యాన్సిల్‌ !
- చట్టాన్ని తప్పుపట్టిన ఐక్యరాజ్యసమితి
'పౌరసత్వ సవరణ చట్టం, 2019'కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. పెద్దసంఖ్యలో యువత, విద్యార్థులు ప్లకార్డులతో నిరసన ర్యాలీ చేపడుతున్నారు. శాంతియుతంగా జరుగుతున్న వారి ర్యాలీలపై పోలీసులు బలప్రదర్శనకు దిగటం ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తోంది. లాఠీచార్జీలో గాయపడ్డవారిలో మరోవ్యక్తి
శుక్రవారం హాస్పిటల్‌లో మృతిచెందాడు. పోలీసుల కాల్పులు, లాఠీచార్జీ నేపథ్యంలో అసోం, మేఘాలయ, త్రిపురలో పరిస్థితి రణరంగంగా మారింది. ఢిల్లీలోని జామియా వర్సిటీ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేసి గాయపరిచారు. ఈ నేపథ్యంలో ఆదివారం షిల్లాంగ్‌ వెళ్లాల్సిన కేంద్ర హోమంత్రి అమిత్‌షా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌ మంత్రులు తమ పర్యటనను రద్దు చేసుకోగా, జపాన్‌ ప్రధాని కూడా క్యాన్సిల్‌ చేసుకునే యోచనలో ఉన్నట్టు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ : షిల్లాంగ్‌, దిబ్రుగఢ్‌, గువహతి...ఈశాన్య రాష్ట్రాల్లోని పలు నగరాల్లో నిరసనల హోరు కొనసాగుతున్నది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోం సహా త్రిపుర, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్టాల్లో ప్రజలు ప్లకార్డులతో, బ్యానర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనేక నగరాల్లో కర్ఫ్యూ విధించారు. సామాజిక మాధ్యమాలు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఎస్‌ఎంఎస్‌, యూట్యూబ్‌, ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేశారు. రవాణా సౌకర్యం పూర్తిగా స్తంభించిపోయింది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో శుక్రవారం చలో రాజ్‌భవన్‌ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది.
నిరసనకారుల్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ జరిపారు. టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. ఈనేపథ్యంలో వందల సంఖ్యలో నిరసనకారులు తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది. విదేశీ మంత్రులు, ప్రతినిధుల భారత పర్యటనపై ఆందోళనలు తీవ్ర ప్రభావం చూపాయి. బంగ్లాదేశ్‌ మంత్రులు భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. జపాన్‌ ప్రధాని షింజో అబే పర్యటన కూడా వాయిదా పడినట్టు తెలిసింది.
పరిస్థితి మరింత దిగజారింది..
అసోం, త్రిపుర, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో శుక్రవారం ప్రజలు పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగారు. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గువహటి, దిబ్రుగఢ్‌, షిల్లాంగ్‌...తదితర చోట్ల నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపటం, లాఠీచార్జ్‌కు దిగటం...పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. గురువారం పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. 11మందికి తీవ్రగాయాలయ్యాయి.
ప.బెంగాల్‌లో రైల్వే స్టేషన్‌కు నిప్పు
ప.బెంగాల్‌లోనూ ఆందోళనలు, నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. బెల్‌దంగా రైల్వే స్టేషన్‌కు, పక్కనున్న రైల్లే భవనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దీంతో రాష్ట్రంలో కొన్ని రైల్వే సర్వీసులు రద్దయ్యాయి. వేలాదిమంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో ఉండిపోవాల్సి వచ్చింది. హౌరా-చెన్నై కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, హౌరా-డిఘౌ కాందారీ ఎక్స్‌ప్రెస్‌తోపాటు మరికొన్ని రైళ్లను దారిమళ్లించడంతో అవి ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.
జపాన్‌ ప్రధాని పర్యటన రద్దు!
బంగ్లాదేశ్‌ హోంమంత్రి, విదేశాంగ మంత్రులు తమ భారత పర్యటనలను రద్దు చేసుకున్నారు. తాజాగా జపాన్‌ ప్రధాని షింజో అబే కూడా తన పర్యటనను రద్దు చేసుకునే యోచనలో ఉన్నట్టు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్‌ ప్రకారం భారత్‌లో షింజో అబే పర్యటన ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. అసోం రాజధాని గువహటి వేదికగా భారత ప్రధాని మోడీ, షింజో అబే భేటీ కానున్నట్టు గతంలో అధికారులు వెల్లడించారు. అసోంలో ఆందోళనలు జరుగుతున్న కారణంగా, షింజో అబే...తన భారత పర్యటనపై పునరాలోచిస్తున్నారనీ, రద్దు చేసుకునే యోచనలో ఉన్నారనీ జపాన్‌కు చెందిన 'జిజి' మీడియా వార్తా కథనం పేర్కొన్నది. కాగా...దీనిపై భారత విదేశంగ ప్రతినిధి రవీశ్‌కుమార్‌ స్పందిస్తూ, అబే పర్యటన రద్దుపై తమకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు.
పరీక్షలను బహిష్కరించిన విద్యార్థులు
చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఆర్‌జీయుఎస్‌యు), స్టూడెంట్‌ యూనియన్‌ ఆఫ్‌ నార్త్‌ ఈస్టర్న్‌ రీజినల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీస్‌ (సన్‌) విద్యార్థి సంఘాలు రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయల్దేరి వెళ్లాయి. విద్యార్థులకు తోడుగా స్థానిక ప్రజలు, అస్సామీ గిరిజన తెగలు జతకలిశాయి. ఈ సందర్భంగా కేంద్ర సర్కారుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముస్లింలపై వివక్షే : ఐక్యరాజ్య సమితి
నూతన పౌరసత్వ చట్టాన్ని ఐక్యరాజ్య సమితి (ఐరాస) తప్పుబట్టింది. ఈ చట్టంలో ముస్లింలు మినహాయించడం ద్వారా ప్రాథమికంగా వారిపై వివక్షతను సూచిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే సమీక్షించాలని ఐరాస మానవ హక్కుల కార్యాలయం పిలుపునిచ్చింది. 'భారత్‌ తీసుకొచ్చిన కొత్త పౌరసత్వ చట్టం ప్రాథమికంగా వివక్షతో కూడుకున్నది. దీనిపట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నామ'ని ఐరాస మానవ హక్కుల కార్యాలయ ప్రతినిధి లారెన్స్‌ అన్నారు. ఈ చట్టం ముస్లిం మినహాయించి, మరో ఆరు మతాల వారికి రక్షణ కల్పించడం మంచిదైనప్పటికీ, చట్టం ముందు అందరూ సమానమే అనే అంశాన్ని బలహీన పరుస్తుందని వెల్లడించారు. దేశ రాజ్యాంగంలోని అంశాల పట్ల భారత్‌ తన నిబద్ధతను నిరూపించుకోవాల్సిన అవసరమున్నదని అన్నారు.
మైనార్టీల హక్కుల్ని పరిరక్షించండి : అమెరికా
'పౌరసత్వ సవరణ చట్టం, 2019'పై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. చట్టం నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తలెత్తిన పరిస్థితులను దగ్గరగా గమనిస్తున్నామని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మతస్వేచ్ఛ, సమానత్వం భారత్‌, అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులుగా ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
అమిత్‌ షా పర్యటన రద్దు
ఆందోళనల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా షిల్లాంగ్‌ పర్యటన రద్దయింది. షెడ్యూల్‌ ప్రకారం, ఈ ఆదివారం షిల్లాంగ్‌లోని ఈశాన్య పోలీస్‌ అకాడమీని అమిత్‌ షా సందర్శించాల్సి ఉంది. సోమవారం అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. కాగా, ఈ పర్యటనలను షా రద్దు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇందుకు గల కారణాలను మాత్రం చెప్పలేదు. అయితే శనివారం, సోమవారం ఆయన జార్ఖాండ్‌లో పర్యటించ నున్నట్టు తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మేము సైతం
మోడీ సర్కార్‌ కు చీమకుట్టినట్టూ లేదు..
27 నగరాల్లో మెట్రో రవాణా
రండి.. చట్టాల గురించి వివరించండి....
వీఐపీల సేవలో...
దళిత యువతిపై దారుణం
అప్పటి వరకు మాల్యాను అప్పగించం!
నేనూ బాధితురాలినే!
ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లకుపార్లమెంటరీ ప్యానెల్‌ సమన్లు
సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులు
బాదుడే బాదుడు
కిసాన్‌ పరేడ్‌ అనుమతిపై మీదే అధికారం
రాజ్యసభలో జమ్మూకాశ్మీర్‌కు ప్రాతినిథ్యం జీరో
మణిపూర్‌లో ఇద్దరు జర్నలిస్టులపై దేశద్రోహం కేసు
లక్ష ట్రాక్టర్లతో కిసాన్‌ పరేడ్‌
దేశంలో ఉద్యోగ సంక్షోభం
2,24,301 మందికి కరోనా వ్యాక్సిన్‌
పెట్రో బాదుడు..
సీఎంల కమిటీ నివేదిక లేకుండానే
తొలి టీకా తీసుకున్న వ్యక్తికి అలర్జీ
కరెంటు తీగలు తగిలి బస్సు దగ్ధం..
లెఫ్ట్‌ఫ్రంట్‌, కాంగ్రెస్‌ చర్చలు
ట్రాక్టర్‌ ర్యాలీపై నేడు సుప్రీంకోర్టు విచారణ
13 ఏండ్ల బాలికపై సామూహిక లైంగికదాడి
సంగీత విద్వాంసుడు ముస్తాఫా ఖాన్‌ ఇకలేరు
అర్నబ్‌ సందేశాలపై జేపీసీ దర్యాప్తుకు విపక్షాలు డిమాండ్‌
కర్నాటకలో ఉన్న మరాఠా ప్రాంతాలను తీసేసుకుంటాం: ఉద్ధవ్‌ఠాక్రే
లేహ్‌లోని 20 మంది ఐటీబీపీ ఆరోగ్య సిబ్బందికి టీకా
జీ-7 శిఖరాగ్ర సదస్సుకు మోడీకి బ్రిటన్‌ ఆహ్వానం
త్రిపుర కాంగ్రెస్‌ చీఫ్‌ కారుపై బీజేపీ కార్యకర్తల దాడి

తాజా వార్తలు

09:19 PM

భర్త ఘన విజయం..భుజాలపై ఎత్తుకుని ర్యాలీ తీసిన భార్య

09:03 PM

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..

08:54 PM

జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం

08:44 PM

అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంత కన్నుమూత

08:15 PM

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

05:58 PM

బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)

05:56 PM

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..

05:52 PM

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్

05:40 PM

వాట్సాప్‌కు భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టి వార్నింగ్..

05:30 PM

ఆసీస్ మాజీ ప్లేయర్లకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన స్పిన్నర్ అశ్విన్

05:26 PM

ఏపీలో 179 కొత్త కేసులు, ఒకరి మృతి

05:21 PM

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:17 PM

పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత..

05:12 PM

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ట్రాక్ట‌ర్‌ ర్యాలీ నిర్వ‌హిస్తాం..

05:00 PM

కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్

04:50 PM

పంచాయతీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

04:42 PM

నరేష్ ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్..

04:20 PM

రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుంది : రేవంత్ రెడ్డి

04:12 PM

చిత్తూరులో యువతిని దారుణంగా..

04:12 PM

వంట గ్యాస్ లీకై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు

04:02 PM

గవాస్కర్ రికార్డును తిరగరాసిన శుభమన్ గిల్..

03:51 PM

బీజేపీ మళ్లీ డిపాజిట్ కోల్పోతుంది : ఉత్తమ్ కుమార్

03:38 PM

మోడీ ఫొటో లేదని..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.