Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫరూక్ గృహ నిర్బంధాన్ని పొడిగించిన సర్కార్
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా నిర్బంధాన్ని మరో మూడు నెలలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మూడు నెలలూ ఫరూక్ తన గృహంలోనే నిర్బంధంలో ఉంటారనీ, దీనినే సబ్ జైలుగా భావిస్తామని రాష్ట్ర అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ముందస్తు చర్యలో భాగంగా ఆగస్టు 5 నుంచి ఫరూక్ అబ్దుల్లాను గృహ నిర్బంధంలోనే ఉంచారు. అంతేకాకుండా 'ప్రజా భద్రతా చట్టం' (పీఎస్‌ఏ) కూడా మొట్టమొదటగా ఈయనపైనే మోపటం గమనార్హం.