Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఎన్‌యూ విద్యార్థిసంఘం నాయకుల కుటుంబాలపై దాడి
న్యూఢిల్లీ : జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుల కుటుంబాలపై పోలీసులు బెదిరింపులకు దిగు తున్నాయని ఆరోపణలు వెలు వడుతున్నాయి. తమ కుటుంబం లోని వారిని పోలీసులు బెది రించారని విద్యార్థి సంఘం 'జేఎ న్‌యూఎస్‌యూ' జనరల్ సెక్రటరీ సతీశ్ చంద్రయాదవ్, ఇతర నాయకులు జితేంద్ర సునా ఆరోపించారు. అలాగే జేఎన్‌యూఎస్‌యూ మాజీ జనరల్ సెక్రటరీ అజీజ్ అహ్మద్ కూడా ఇదేరకమైన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఆయన ఫేస్‌బుక్‌లో సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన కొంతమంది తమ ఇంటికి వచ్చారనీ, ఇంట్లో ఉన్నవారితో ఇష్టమొచ్చినట్టు మాట్లాడారనీ, కాల్చిపారేస్తామని బెదిరించారనీ ఎజాజ్ అహ్మద్ తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, జేఎన్‌యూలో హాస్టల్ ఫీజు పెంపు, మరికొన్ని అంశాలపై కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడటం వల్లే తనను లక్ష్యంగా చేసుకున్నారని అహ్మద్ అన్నారు.
బుల్లెట్...అడ్రస్ అడిగి రాదు.. : ఎజాజ్ అహ్మద్, జేఎన్‌యూఎస్‌యూ మాజీ జనరల్ సెక్రేటరీ
గత కొన్నాండ్లుగా అనేక వేదికలపై కేంద్ర ప్రభుత్వ విధానాల్ని విమర్శిస్తూ వస్తున్నా. వివిధ అంశాలపై నా ఆందోళనలు, అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తున్నా. కానీ ఇటీవల నా విషయంలో చోటుచేసుకున్న ఘటనలు కొంత ఆందోళనకు, భయానికి గురిచేస్తున్నాయి. కాశ్మీర్‌లో ఉన్న నా కుటుంబం వద్దకు వెళ్లి నిఘా విభాగం పోలీసులు బెదిరించారు. వివిధ రకాల విచారణ బృందాలు నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ''బుల్లెట్ అడ్రస్ అడిగిరాదు..'' అంటూ ఇంట్లో ఉన్నవారిని బెదిరించారు. నా కుటుంబంలో ఉన్న చిన్నాపెద్దా అందర్నీ భయబ్రాంతులకు గురిచేశారు. నేను జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడిగా ఉండటమే దీనికంతటికీ కారణం. నా కార్యకలాపాలకు నా కుటుంబ సభ్యులకు సంబంధం ఏంటి? వాళ్లనెందుకు ఇంతగా వేధించాలి? అన్నది నా ప్రశ్న.