Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఎన్‌యూ ఘటన సాక్ష్యాధారాల భద్రతపై వివరణ కోరిన కోర్టు
- విధులకు హాజరుకావాలని అధ్యాపకులకు వర్సిటీ యంత్రాంగం బెదిరింపులు
న్యూఢిల్లీ: జేఎన్‌యూలో విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన దాడికి సంబం ధించిన సీసీటీవీ ఫుటేజ్, వాట్సాప్ డేటా, ఇతర సాక్ష్యాధారాలను భద్రపరచాలని దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీకోర్టు సోమ వారం విచారణకు స్వీకరించింది. ఈ మేరకు కోర్టు ఢిల్లీ పోలీసులను వివరణ కోరింది. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను, ఇతర సాక్ష్యాధారాలను భద్ర పరచాలనీ, వాటిని కోర్టుకు అందజేయా లని జేఎన్‌యూ పరిపాలన విభాగాన్ని కోరినట్టు పోలీసులు తెలిపారు. కానీ ఇప్పటివరకూ జేఎన్‌యూ
నుంచి ఎలాంటి స్పందనా రాలేదని అన్నారు. అలాగే జేఎన్‌యూ దాడికి సంబంధించిన సందేశాలు, ఫోటోలు, వీడియోలు, ఫోన్ నంబర్‌లతో సహా ''యూనిటీ ఎగైనెస్ట్ లెఫ్ట్'', ''ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్‌ఎస్‌ఎస్'' అనే వాట్సాప్ గ్రూపులకు సంబంధించిన డేటాను భద్రపరచాలని వాట్సాప్‌కు లేఖ రాసినట్టు పోలీసులు కోర్టుకు వివరించారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఫేస్‌బుక్, వాట్సాప్‌లకు నోటీసులు జారీ చేసింది.
విధులకు హాజరుకావాల్సిందే..!
జేఎన్‌యూ వీసీ జగదీష్ కుమార్ వైఖరిని నిరసిస్తూ.. తరగతుల బహిష్కరణకు పిలుపు నిచ్చిన అధ్యాపకుల బృందంపై జేఎన్‌యూ పాలనాయంత్రాంగం బెదిరింపులకు దిగింది. తరగతులను తిరిగి ప్రారంభించాలని, లేకుంటే సర్వీస్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని హెచ్చరించింది. కాగా, దీనిపై జేఎన్‌యూటీఏ ఘాటుగా స్పందించింది. ప్రస్తుత పరిస్థితిని నిలువరించేందుకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) అధికారులతో సమావేశంకానున్నామనీ, వీసీ దుశ్చర్యలపై ఫిర్యాదు దాఖలు చేయనున్నామని జేఎన్‌యూ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు జేఎన్‌యూటీఏ జనరల్ బాడీ సమావేశం ఓ తీర్మానాన్ని కూడా విడుదల చేసింది. ఈ నెల 10న జేఎన్‌యూ జారీ చేసిన రెండు ఉత్తర్వులను నిరాకరిస్తున్నట్టు తీర్మానం చేశామని జేఎన్‌యూటీఏ అధ్యక్షుడు లోబియాల్, కార్యదర్శి సురజిత్ మజుందార్ తెలిపారు. ఈ నెల 5న జరిగిన హింసాత్మక దాడి ఘటన అనంతరం వీసీని కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ చేపడుతున్న ఆందోళనల్లో ఇతర అధ్యాపకులు కూడా పాల్గొనాలని, తమ నిర్ణయాలను పూర్తిగా అమలు చేయాలని జేఎన్‌యూటీఏ తన సహోద్యోగులకు విజ్ఞప్తి చేసింది.
విద్యార్థులపై పోలీసుల దాడులు :ప్రశ్నించిన పార్లమెంట్ ప్యానెల్
నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు దాడి చేయడాన్ని పార్లమెంటరీ ప్యానెల్ ప్రశ్నించిందని, విద్యార్థులతో సరైన రీతిలో వ్యవహరించాలని సూచించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. జామియా వర్శిటీలో విద్యార్థులపై పోలీసులు జరిపిన అమానుష దాడిలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో ఒక గుంపు విద్యార్థులు, అధ్యాపకులపై జరిపిన దాడుల ఘటనలపై కూడా ఆరాతీసింది. అలాగే రాజధాని ఢిల్లీలో తరచూ ఆంక్షలు విధించడంపై ప్రశ్నించిందని, ఇది సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్‌శర్మ అధ్యక్షతన నిర్వహించిన హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, ఢిల్లీ పోలీస్ చీఫ్ అమూల్య పట్నాయక్ సోమవారం హాజరయ్యారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్, హర్యానా డీజీపీ మనోజ్ యాదవ్, యూపీ, రాజస్తాన్ పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరై నేరాల గురించి వివరించినట్టు సమాచారం