Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఏడీఎంకే అవినీతిపై పుస్తకం అమ్ముతున్నందుకు
చెన్నై: చెన్నై బుక్‌ఫెయిర్ నిర్వాహకుల్ని బెదిరించారన్న ఆరోపణలతో జర్నలిస్ట్ వి.అంబజగన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్‌ఫెయిర్‌లో స్టాల్ అద్దెకు తీసుకున్న అంబజగన్ ప్రభుత్వ వ్యతిరేక పుస్తకాన్ని స్టాల్‌లో అమ్ముతున్నారన్న కారణంతోనే ఆయనపై తప్పుడు కేసులు బనాయించినట్టు చెన్నై ప్రెస్‌క్లబ్ కార్యదర్శి భారతీ తమిళన్ తెలిపారు. ప్రస్తుతం చెన్నైలో బుక్‌సెల్లర్స్ అండ్ పబ్లిషర్స్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇండియా(బపాసీ) ఆధ్వర్యంలో బుక్‌ఫెయిర్ జరుగుతోంది. అందులో ఓ స్టాల్‌ను అద్దెకు తీసుకున్న అంబజగన్ 'కరప్షన్ బుక్ ఆఫ్ చెన్నై కార్పొరేషన్' అనే పుస్తకాన్ని అమ్మకానికి పెట్టారు. అందులో చెన్నై కార్పొరేషన్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతి గురించి వివరించారు. ఆర్‌టీఐ చట్టం కింద తీసుకున్న సమాచారం ఆధారంగా నిధుల దుర్వినియోగం జరిగినట్టు ప్రస్తావించారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే నేతలకు ఆ అవినీతిలో ప్రమేయమున్నట్టు తెలిపారు.
బపాసీ అధ్యక్షుడు ఆర్‌ఎస్ శణ్ముగం ఈ నెల 11న అంబజగన్‌కు నోటీస్ జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ వ్యతిరేక పుస్తకాన్ని అమ్ముతున్నావంటూ ఆ నోటీస్‌లో ఆరోపించారు. స్టాల్‌ను ఖాళీ చేయించారు. మరుసటి రోజే ఈ నెల 12న అంబజగన్‌ను నాన్‌బెయిలెబుల్ కేసులో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.