Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ, ఆరెస్సెస్ ఆందోళన
బెంగళూరు: కర్నాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కపాల బెట్టపై 114 అడుగుల ఎత్తు ఏసుక్రీస్తు విగ్రహాం నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర అధికార పార్టీ బీజేపీ నాయుకులు, కార్యకర్తలు, అరెస్సెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. విగ్రహ నిర్మాణాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ, ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్, హిందూ జాగారణ్ వేదిక ప్రతినిధులు సోమవారం కనకపురలో ర్యాలీ నిర్వహించారు. కాషాయ దుస్తులు ధరించి, తలపై టోపీలు, చేతుల్లో జెండాలను పట్టుకుని సంఫ్‌ు పరివార్ కార్యకర్తలు, ప్రతినిధులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విగ్రహ నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిన 10 ఎకరాల స్థలాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, కాంగ్రెస్‌తో పాటు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం గమనార్హం. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డీకే శివకుమార్ సొంత నియోజకవర్గం కనకపురలో ఈ విగ్రహాన్ని నిర్మించనున్నారు.