Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఏఏపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న పరిణామా లు చూస్తుంటే చాలా విచారం కలుగుతున్నది. మనసుకు తీవ్రంగా బాధేస్తోంది. అని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మనోవేదనను వ్యక్తపరిచారు. సీఏఏపై కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని ఆయన అభిప్రాయ పడ్డారు. న్యూయార్క్‌లోని మాన్‌హాటన్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో నాదెళ్ల పై విధంగా స్పందించారు. భారతీయ బహుళజాతి సంస్థ ఇన్ఫోసిస్ సంస్థకు.. తదుపరి సీఈవోగా బంగ్లాదేశ్ వలసదారు డిని చూడటానికి ఇష్టపడతానని బజ్ ఫీడ్ న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్ బెన్‌స్మిత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాదెళ్ల తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సీఏఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సహా పలువురు మోడీ సర్కారును వ్యతిరేకిస్తున్న తరుణంలో మెక్రోసాఫ్ట్ సీఈఓ, భారత్‌లో పుట్టిన నాదెళ్ల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సత్యనాదెళ్ల సీఏఏపై చేసిన ప్రకటనను చరిత్రకారుడు రామ్‌చంద్రగుహ స్వాగతిం చారు. నాదెళ్ల తన మనసులో ఏమనుకుంటున్నారో చెప్పటం సంతోషంగా ఉన్నదన్నారు. ఐటీ పరిశ్రమలో ఉన్న దిగ్గజాలు కూడా నాదెళ్ల మాదిరిగా ధైర్యంతో ముందుకు రావాలని గుహ కోరారు.