Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ ఎన్నికలపై అమిత్‌షా
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ఎన్నికల్లో అమిత్‌షా సహా బీజేపీ నేతలు వివాదాస్పద, మత ఉద్రిక్తతలను పెంచే విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ మిషన్‌ను గట్టిగా నొక్కండి.. అది సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలుచేస్తున్న షాహీన్‌బాగ్‌కు వినిపించాలంటూ దేశానికి హౌంమంత్రి హౌదాలో ఉండి కోరారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా పార్టీ నేతలందరూ వివాదాస్పదవ్యాఖ్యలు చేస్తుంటే. ఎన్నికల్లో లబ్ది కోసం.. ఆ పార్టీ అగ్రనేతలు మౌనం వహించారు. ఇప్పుడు ఎన్నికల ఫలితాలతో దిమ్మతిరిగాక.. అమిత్ షా వివరణ ఇచ్చుకోకతప్పలేదు. తన అంచనాకు భిన్నంగా ఫలితాలొచ్చాయన్నారు. తానూ అలాంటి వ్యాఖ్యలు చేసిన షా ఇప్పుడు ఆ విద్వేష తప్పిదాలను ఇతర నేతలపై నెట్టే ప్రయత్నం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 'గోలీ మారో'... 'ఇండోపాక్ మ్యాచ్' వంటి విద్వేష ప్రసంగాలే తమ విజయానికి గండి కొట్టాయని భావిస్తున్నానని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గురువారం వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ కేవలం విజయం లేదా ఓటమి కోసమో ఈ ఎన్నికల్లో పోరాడలేదనీ, ఎన్నికల పోరు ద్వారా తన సైద్ధాంతిక వ్యాప్తి కోసం ప్రయత్నించిందని బుకాయించే ప్రయ త్నం చేశారు. గోలీమారో , ఇండోపాక్ మ్యాచ్ వంటి వివాదాస్పద నినాదాలు చేయ కుండా వుండాల్సిం దనీ, తమ పార్టీ ఇటువంటి నినాదాలకు దూరమని ఆయన ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. కొంతమంది పార్టీ నేతలు చేసిన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతోనే తమ పార్టీ ఓటమి పాలైందని ఆయన ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో అంగీకరించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు తప్పుడు మార్గంలో వెళ్లాయని తాను భావిస్తున్నాననీ, అయితే ఈ ఫలితాలను పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ), జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్నార్సీ)పై ప్రజలిచ్చిన తీర్పుగా తాను భావించటం లేదని ఆయన స్పష్టం చేశారు. సీఏఏ వంటి అంశాలపై తనతో చర్చించదలుచుకున్న వారు తన కార్యాలయానికి వచ్చి సమయం కోరితే మూడు రోజుల్లో వారికి సమయం కేటాయిస్తామన్నారు. మత ప్రాతిపదికన దేశ విభజన జరగటానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన విమర్శించారు.