Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ట్రంప్‌ కంట పడకుండా | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 14,2020

ట్రంప్‌ కంట పడకుండా

- మురికివాడలకు అడ్డుగోడ
- గాంధీనగర్‌ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లే మార్గంలో నిర్మాణం
- రోడ్ల వెంబడి చెట్లు
- అమెరికా అధ్యక్షుడి మెహర్భానీ కోసం మోడీ పాట్లు
అహ్మదాబాద్‌: భారతదేశానికి అమెరికా అధ్యక్షుడు వస్తున్నారంటే చాలు...! వారి కంటికి పేదలు కనిపించకూడదు. అంతా ఆహా.. ఒహౌ అన్నట్టుగా ఉన్నదని వచ్చిన వారు అనుకుంటే చాలు. ఇది మన పాలకుల తీరు. 2002లో హైదరాబాద్‌కు అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ వచ్చినపుడు ఇక్కడ ఉన్న బిచ్చగాళ్లను వెతికి మరీ భాగ్యనగరం బయటకు తరిమారు నాటి ముఖ్యమంత్రి చంద్ర బాబు. అలాగే రెండేండ్ల క్రితం ట్రంప్‌ కూతురు ఇవాంకా వచ్చినప్పుడూ రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ సర్కారు అదే ఫార్ములాను అమలుచేసింది. ఇక ఇప్పుడు గుజరాత్‌లోనూ అదే సీన్‌ రిపీట్‌ కానున్నది. మరో పది రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత పర్యటనకు రానున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనున్నది. అయితే ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు ఆయన వస్తుండటంతో అక్కడి బీజేపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నది. సబర్మతి ఆశ్రమ సందర్శన. ఎంపిక చేసిన కొందరు పారిశ్రామికవేత్తలను అమెరికా అధ్యక్షుడు కలుస్తారని సమాచారం.
గరీబోళ్ల బతుకులు కనిపించకుండా..
భారత్‌లో లక్షలాది కడుపేద కుటుంబాలు మురికివాడల్లో నివాసముంటున్నాయి. మోడీ సర్కార్‌ వచ్చాక పేదరికం మరింతగా పెరిగింది. బీజేపీ సర్కారు దీనికి పరిష్కారం చూపకుండా ట్రంప్‌ పర్యటించే మార్గంలోని మురికివాడలు ఆయనకు కనిపించకుండా అడ్డుగోడ నిర్మాణం చేపడుతున్నది. ఈ మేరకు అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఒక్కో గోడ ఎత్తును కనీసం ఆరు నుంచి ఏడు అడుగుల వరకు పెంచుతున్నారు. సుమారు రూ. 50 కోట్ల వ్యయంతో ఈ పనులు చకచకా జరుగుతున్నాయి. గాంధీనగర్‌ విమానాశ్రయం నుంచి ఆర్థిక రాజధాని అహ్మదాబాద్‌ మధ్య ఉండే సర్దార్‌ వల్లభ్‌ భారు పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ట్రంప్‌, మోడీలు రోడ్‌ షో నిర్వహించనున్నారు. విమానాశ్రయాన్ని దాటి బయటికి వచ్చాక.. అహ్మదాబాద్‌ వైపు వెళ్లే మార్గానికి ఒక వైపున పెద్ద సంఖ్యలో మురికివాడలు ఉంటాయి. వాటిని దేవ్‌ శరణ్‌ లేదా శరణి ఆవాస్‌ అని పిలుస్తారు. ఇపుడు ఈ మురికివాడలు కనిపించకుండా అడ్డుగోడ కడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
పచ్చదనం కూడా..
గోడ వెనుక ఏమున్నదో తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నంతో... ముందు భాగమంతా రంగులు, మొక్కలతో అలంకరించబోతున్నారు. దీనికోసం సుమారు 2500 మొక్కలను సిద్ధం చేస్తున్నారు. ఈ రోడ్‌షోలో మురికివాడలు కనిపించకుండా బీజేపీ సర్కార్‌ జాగ్రత్త పడుతున్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాగే...
2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ హైదరాబాద్‌ పర్యటనకు వచ్చారు. దీంతో భాగ్యనగరంలో క్లింటన్‌ రాకపోకలు సాగించే మార్గాల్లోని భవనాలకు రంగులు వేయించింది చంద్రబాబు సర్కారు. అలాగే రెండేండ్ల క్రితం ట్రంప్‌ కూతురు ఇవాంకా ట్రంప్‌ హైదరాబాద్‌కు వచ్చినప్పుడూ హడావుడిగా కొత్త రోడ్లను నిర్మించడం, బిచ్చగాళ్లను జైళ్లకు తరలించడం వంటివి టీఆర్‌ఎస్‌ సర్కారు చేసింది. ఇపుడు గుజరాత్‌లో మురికివాడలు కనిపించకుండా బీజేపీ పాలకులు అడ్డుగోడలు కట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అగ్రరాజ్య అధ్యక్షులు వచ్చినప్పుడు వారికి ఇక్కడి వాస్తవాలు తెలియకుండా దాచిపెట్టడం కోసమే భారత పాలకులు ఇలా చేస్తున్నారని వారు విమర్శలు చేస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజీ లేదు
పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేందుకే.. ఈ చట్టాలు : రాహుల్‌
29 నుంచి పార్లమెంట్‌
గుజరాత్‌లో ఘోరం
బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయాలి
అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ చైర్‌పర్సన్‌ వి.శాంత కన్నుమూత
సహారా ఎడారిపై మంచు పరదా
విదేశీ పెట్టుబడుల నిబంధనల్లో మార్పులు
'ప్రైవసీ పాలసీ' మార్పులను వెనక్కి తీసుకోవాలి
7 నెలల కనిష్టానికి కరోనా కేసులు
ఎర్రకోట వద్ద బర్డ్‌ఫ్లూ కలకలం
ఎంపీలో తొలి 'లవ్‌ జిహాద్‌' కేసు
మేము సైతం
మోడీ సర్కార్‌ కు చీమకుట్టినట్టూ లేదు..
27 నగరాల్లో మెట్రో రవాణా
రండి.. చట్టాల గురించి వివరించండి....
వీఐపీల సేవలో...
దళిత యువతిపై దారుణం
అప్పటి వరకు మాల్యాను అప్పగించం!
నేనూ బాధితురాలినే!
ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లకుపార్లమెంటరీ ప్యానెల్‌ సమన్లు
సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులు
బాదుడే బాదుడు
కిసాన్‌ పరేడ్‌ అనుమతిపై మీదే అధికారం
రాజ్యసభలో జమ్మూకాశ్మీర్‌కు ప్రాతినిథ్యం జీరో
మణిపూర్‌లో ఇద్దరు జర్నలిస్టులపై దేశద్రోహం కేసు
లక్ష ట్రాక్టర్లతో కిసాన్‌ పరేడ్‌
దేశంలో ఉద్యోగ సంక్షోభం
2,24,301 మందికి కరోనా వ్యాక్సిన్‌
పెట్రో బాదుడు..

తాజా వార్తలు

09:00 AM

నేడు రైతు సంఘాలతో కేంద్రం చర్చలు

08:50 AM

ఇంటర్ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

08:33 AM

ఘోరం రోడ్డు ప్రమాదం: 13 మంది దుర్మరణం

08:06 AM

మంచు మనోజ్ స్నేహితుడు కన్నుమూత

07:51 AM

నేడు ఉచిత ఆన్‌‌లైన్‌ జాబ్‌‌మేళా

07:46 AM

హైవేపై బోల్తాపడ్డ లారీ

07:26 AM

నేడు నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన

07:22 AM

రాష్ట్రవ్యా‌ప్తంగా జిల్లా ట్రైబ్యునళ్లు సేవ‌లు ప్రారంభం

07:19 AM

కందుల కొనుగోలుకు రంగం సిద్ధం

07:14 AM

ఆగి ఉన్న లారీలో మంటలు డ్రైవర్ సజీవ దాహనం

07:09 AM

నేడు ఖమ్మం జిల్లా నేతలతో భేటీకానున్న కేటీఆర్

07:05 AM

వ్యా‌క్సి‌నేష‌న్‌..తెలంగాణ‌ను అభినందించిన కేంద్రం

07:01 AM

స్టార్ ఫుట్​బాలర్‌పై రెండు మ్యా‌చ్‌ల నిషేధం

06:47 AM

ప్రేమించి పెళ్లిచేసుకొని..రెండు కత్తులతో దారుణంగా..!

06:35 AM

ఇన్ఫోసిస్‌ ఉద్యోగి ఆత్మహత్య

10:01 PM

అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ

09:51 PM

టాలీవుడ్ యువ హీరో విస్వంత్‌పై కేసు నమోదు

09:32 PM

తెలంగాణ కరోనా వాక్సిన్ బులిటెన్ విడుదల..

09:19 PM

భర్త ఘన విజయం..భుజాలపై ఎత్తుకుని ర్యాలీ తీసిన భార్య

09:03 PM

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..

08:54 PM

జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం

08:44 PM

అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంత కన్నుమూత

08:15 PM

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.