Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
జైళ్లు సిద్ధంగా లేవు..! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Mar 31,2020

జైళ్లు సిద్ధంగా లేవు..!

-ఖైదీలు అక్కడ నరకం అనుభవిస్తున్నారు
- కరోనా గురించి అవగాహనే లేదు
- బెయిల్‌పై విడుదలైన ఖైదీల ఆందోళన
ముంబయి : కరోనా మహమ్మారిని నియంత్రించే చర్యల్లో భాగంగా జైళ్లలో ఉండి విచారణ ఎదుర్కొంటున్న (అండర్‌ ట్రయల్‌) ఖైదీలను విడుదల చేయాలనీ, అక్కడే ఉండేవారికి వసతులు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ జైళ్లు అందుకు సిద్ధంగా ఉన్నాయా..? అంటే లేదనే సమాధానం వినిపిస్తున్నది. గుంపులు గుంపులుగా ఉంటే కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్న నేపథ్యంలో యూటీ, వికలాంగులైన ఖైదీలను పెరోల్‌పై విడుదల చేయాలని కోర్టు ఇటీవలే ఆదేశించింది. అంతేగాక చెరసాలల్లో బంధీలుగా ఉంటూ జ్వరం, జలుబుతో బాధపడుతున్న ఖైదీలను ప్రత్యేక గదుల్లో ఉంచాలనీ, వారికి చికిత్స చేయించాలని ఉత్తర్వులు జారీ చేసినా జైలు అధికారులు మాత్రం వాటిని బేఖాతరు చేస్తున్నారని పెరోల్‌పై విడుదలైన ఖైదీలు చెబుతున్నారు. జైళ్లో కనీస వసతులు అందుబాటులో లేవనీ, అసలు లోపల ఉన్నవారికి కరోనా గురించిన అవగాహాన కూడా లేదని అంటున్నారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులతో మహారాష్ట్రలోని రారుగఢ్‌ జిల్లా తలోజా కేంద్ర కారాగారం నుంచి ఇటీవలే కొంతమంది యూటీ ఖైదీలను విడుదల చేశారు. జైళ్లో ఉన్న పరిస్థితులను వారిలా వివరిస్తున్నారు. 'లోపల ఖైదీలు నరకం అనుభవి స్తున్నారు. కరోనా భయంతో వాళ్లు భయపడుతూ కాలం వెల్లదీస్తున్నారు. జైళ్లో ఎవరికీ మాస్క్‌లు, సానిటైజర్లు లేవు. ప్రభుత్వం చెబుతున్న సామాజిక దూరం ఎవరూ పాటించడం లేదు. అసలు చాలా మందికి కరోనా వైరస్‌, దాని వ్యాప్తి గురించిన విషయాలేమీ తెలియదు. ఖైదీలకే కాదు..! జైలు అధికారులకూ దాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు, రాకుండా అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా సరైన అవగాహన లేదు' అంటూ రారుగఢ్‌కు చెందిన ఓ ఖైదీ(40) తెలిపాడు. దేశవ్యాప్త మూసి వేతతో ఎక్కడికక్కడ బంద్‌ ఉండటంతో పెరోల్‌పై విడుదలైన ఖైదీలు సొంత ఇండ్లకు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతు న్నారు. పూచీకత్తుతో వీరిని బెయిల్‌పై విడుదల చేస్తున్న అధికారులు సైతం.. ఖైదీలు సొంత ఊళ్లకు చేయడానికి ఏర్పాట్లుచేయడం మరిచారని వాపోతున్నారు. ఇదే విషయమై మరో ఖైదీ మాట్లాడుతూ.. 'నేను రారుగఢ్‌కు సమీపంలో ఉంటాను. నా కుటుంబసభ్యులు ఎలాగోలా నన్ను ఇంటికి చేర్చారు. కానీ ఎక్కడెక్కడి నుంచో ఉన్న ఖైదీలకు రవాణా సౌకర్యాల్లేవు. వాళ్లు ఇంటికెళ్లడానికి నానా ఇక్కట్లు పడుతున్నారు' అని తెలిపాడు. జైలు అధికారులను దీని గురించి ప్రశ్నిస్తే.. తమ దగ్గర తగినంతగా సిబ్బంది లేరనీ, దీంతో తామే పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నా మని చెబుతుండటం గమనార్హం.
మరోవైపు కరోనా కట్టడికి గానూ ఖైదీలు వారి బంధువులను కలుసుకోవడాన్ని, నిందితులను కోర్టుల ఎదుట హాజరుపర్చడాన్ని అధికారులు పాక్షికంగా రద్దు చేశారు. వారిని కలవడానికి న్యాయవాదులను కూడా అనుమతించడం లేదు. దీంతో లోపల ఉన్న ఖైదీలు, బయట ఉన్న వారి బంధువులు తీవ్ర మానసిక వేధనకు గురవుతున్నారు. తమవారిని ఒక్కసారైనా కలవడానికి అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నా అధికారులు మాత్రం అందుకు ససేమీరా అంటున్నారు. దీనిపై ఖైదీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు బయటకు వచ్చినవారు చెబుతున్నారు. మార్చి మొదటివారం నుంచి సందర్శన ప్రక్రియను అధికారులు ఆపేశారు.
ఇదిలాఉంటే.. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న ఖైదీలకు కోర్టు ఉత్తర్వులు వర్తించవు. పీఎంఎల్‌ఏ, ఉపా, ఎన్‌డీపీఎస్‌, బ్యాంకు, ఆర్థిక కుంభకోణాల్లో విచారణ ఎదుర్కొంటున్నవారికి ఈ అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పలు కేసుల్లో అరెస్టైన పలువురు హక్కుల కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. బీమా కోరేగావ్‌ కేసులో అరెస్టైన వరవరరావు, షోమా సేన్‌, సాయిబాబ వంటి వారి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇప్పటికే వారు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడు తుండగా.. తాజాగా కరోనా నేపథ్యంలో వారికేదైనా అయితే కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

జైళ్లలో జనసంఖ్యను తగ్గించండి : ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
సామాజిక దూరం పాటించే లక్ష్యంలో భాగంగా జైళ్లలో జనసంఖ్యను తగ్గించాలని ఢిల్లీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉన్నత స్థాయి కమిటీ సమావేశం ఏర్పాటు చేసిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హిమ కోహ్లి.. విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ఎమర్జెన్సీ పెరోల్‌ మీద విడుదల చేయాలని ఆదేశించారు. విడుదలయ్యేవారికి కనీసం ఎనిమిది వారాల పాటు పూచీకత్తుతో కూడిన బెయిల్‌ ఇవ్వాలని తెలిపారు. అంతేగాక లోపల ఉండేవారి ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఢిల్లీలోని 16 జైళ్లలో 14,355 మంది అండర్‌ ట్రయల్‌ ఖైదీలున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తిరస్క'రణం'..
పుణె సీరమ్‌ లో భారీ అగ్నిప్రమాదం
కేరళ నుంచి 'పరేడ్‌'కు రెండో విడతలో మరో 500 మందికిపైగా రైతులు
కేరళలో 2.67 కోట్ల మంది ఓటర్లు
ఉడకని చికెన్‌, గుడ్లు తినొద్దు
'కోబ్రా' బెటాలియన్‌లోకి మహిళలు
మంత్రివర్గాన్ని విస్తరించిన యడియూరప్ప
అదే తీరు
వద్దనలేం..
కేరళ ఐదోస్థానానికి... ఒక స్థానం మెరుగుపర్చుకుని..
ఏపీలో దళిత యువకులపై దాష్టీకం...
వాల్తేరు క్లబ్‌ భూ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తునకు ఏపీ హైకోర్టు బ్రేక్‌
రైతు వ్యతిరేక చట్టాలపై ఆగ్రహం
పొరుగు దేశాలకు భారత్‌ వ్యాక్సిన్‌ !
తిరువనంతపురం ఏయిర్‌ పోర్టుపై న్యాయపోరాటం చేస్తాం
ఇది.. అసాధారణం పెరారివలన్‌ కేసు ఆలస్యంపై సుప్రీంకోర్టు
ఎంపీ ఝర్నాదాస్‌ వైద్యపై హత్యాయత్నం
ఏపీ రాజధాని గ్రామాల్లో రైతుల భారీ ర్యాలీ
ఇవి మభ్యపెట్టే చర్చలు మాత్రమే!
గెలాక్సీ ఎస్‌ 21 సిరీస్‌కు ప్రీ బుకింగ్స్‌
రైతులతో చర్చలకు ప్రధాని దూరమెందుకు...
విడాకులివ్వకుండానే మరో బంధం నేరమే !
బెంగాల్‌లో ఘోర ప్రమాదం
మత స్వేచ్ఛను నిరోధించే మధ్యప్రదేశ్‌ సర్కారు
30న అఖిలపక్ష సమావేశం
రాజీ లేదు
పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేందుకే.. ఈ చట్టాలు : రాహుల్‌
29 నుంచి పార్లమెంట్‌
గుజరాత్‌లో ఘోరం
బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయాలి

తాజా వార్తలు

03:41 PM

నల్గొండ రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

03:37 PM

అల్మాస్ పూర్ దళితులపై దాడి చేసిన గుండాలను శిక్షించాలి: కేవిపిఎస్

03:28 PM

ఉద్యోగులకు వారంలో మూడు రోజులు సెలవులు..!

03:14 PM

నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసిన హరీష్‌రావు

03:10 PM

రేపు ధర్నా చౌక్‌లో ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నిరాహారదీక్ష

02:56 PM

ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు

02:43 PM

ఫ్యాక్టరీ నుంచి విషవాయువు లీక్‌: ఏడుగురికి అస్వస్థత

02:31 PM

మమతా బెనర్జీకి మరో షాక్

02:14 PM

ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లపై జూన్ 21 వరకు స్టే

02:00 PM

గవర్నర్ తో ముగిసిన నిమ్మగడ్డ రమేశ్ భేటీ

01:50 PM

మే 29న కాంగ్రెస్ నూతన అధ్యక్షుని ఎన్నిక.!

01:38 PM

క్షమాపణ చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

01:26 PM

సెర్చ్ ఇంజిన్ ఆపేస్తామంటూ.. గూగుల్ హెచ్చరిక

01:14 PM

విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. అధికారుల్లో టెన్షన్

01:03 PM

రైతులు అప్పు చెల్లించలేదని పొలం వేలం పెట్టిన బ్యాంకు అధికారులు

12:54 PM

పేదలకు ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు : ఈటల

12:44 PM

లాలూ ప్రసాద్ యాదవ్ కు తీవ్ర అస్వస్థత..

12:34 PM

కొమిరేపల్లిలోనూ వ్యాప్తి చెందిన వింత వ్యాధి..

12:23 PM

సగం ఉడికిన చికెన్, గుడ్లు తినకండి : FSSAI

12:13 PM

డ‌యాగ్నోస్టిక్ మినీ హ‌బ్ సెంట‌ర్‌ను ప్రారంభించిన కేటీఆర్

12:07 PM

శివమొగ్గ భారీ పేలుడు ఘటనలో ఇద్దరు అరెస్ట్

11:56 AM

శశికళ ఆరోగ్య పరిస్థితి విషమం.. నేతల్లో టెన్షన్

11:46 AM

రూ.18వేల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

11:42 AM

స్నేహం ముసుగులో బాలిక​పై సామూహిక లైంగిక దాడి

11:34 AM

వరంగల్ జిల్లాలో దారుణం..

11:17 AM

100 రోజులు ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలి : బైడెన్

11:09 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

11:01 AM

కార్మిక,కర్షక రాష్ట్ర జాతరకు కార్మికుల ఘన స్వాగతం..

10:50 AM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్యశాఖ మంత్రి..

10:39 AM

నోయిడాలో ఆస్పత్రి వద్ద బాంబు కలకలం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.