Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకంపై తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా, తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రొడక్షన్ నెంబర్ 6గా తెరకెక్కబోయే ఈ చిత్రం రెగ్యులర్ చిత్రీకరణ అరకులో ప్రారంభమైంది. ఈ చిత్రంలో నక్షత్ర హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ, 'శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌లో మొత్తం మూడు సినిమా నిర్మాణంలో ఉన్నాయి. రెండు చిత్రాలను తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, మరో సినిమాని విక్రాంత్ దర్శకత్వం చేస్తున్నారు. ప్రస్తుతం తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్6గా ఓ సినిమాని రూపొందిస్తున్నాం. ఈ చిత్రం రెగ్యులర్ చిత్రీకరణ అరకులో ఆరంభమైంది. వినోదభరితమైన కథ, కథనానికి అరకులోని అందమైన లొకేషన్స్ పర్‌ఫెక్ట్ యాప్ట్‌గా ఉంటాయి. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వడం ఖాయం. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తాం' అని తెలిపారు. హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ, 'ఎప్పటి నుంచో అందమైన అరకు లొకేషన్స్‌లో వినోద భరిత ప్రేమకథ చేయాలనే కోరిక ఉండేది. ఇప్పుడు ఆ కోరిక ఈ చిత్రంతో నెరవేరబోతోంది. ఇదొక వినోద భరితమైన కుటుంబ ప్రేమకథా చిత్రం. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలూ ఈ సినిమాలో ఉన్నాయి. అరకులోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణను స్టార్ట్ చేశాం. కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని చెప్పారు.
'హీరోయిన్‌గా నటిస్తున్న తొలి సినిమా ఇది. కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. నా పాత్రకి ఈ సినిమాలో చాలా స్కోప్ ఉంటుంది. ఓ మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా తర్వాత నటిగా నాకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను' అని హీరోయిన్ నక్షత్ర తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా : శివ రాథోడ్, సంగీతం : వి.ఆర్.ఏ .ప్రదీప్, పవన్, మాటలు: శివ కాకు, రమేష్ వెలుపుకొండ, ఫైట్ మాస్టర్:- శ్యామ్ కరద.