Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాని చూసి గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నామని బన్నీవాసు చెప్పారు. ఈ ఒక్క మాట చాలు ఓ దర్శకుడిగా నేను సక్సెస్ అయ్యానని చెప్పడానికి' అని అంటున్నారు దర్శకుడు మున్నా. యాంకర్ ప్రదీప్, అమృతా అయ్యర్ జంటగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'. ఎస్.వి.బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో దర్శకుడు మున్నా మాట్లాడుతూ,'సాప్ట్‌వేర్ జాబ్ వదిలేసి సినిమా మీద ఓ ప్యాషన్‌తో వచ్చాను. దర్శకుడు సుకుమార్ వద్ద పని చేసిన అనుభవం నాకెంతో ఉపయోగపడింది. ఇప్పటికే అనూప్ ఇచ్చిన ఆడియో పెద్ద హిట్ అయ్యింది. అలాగే సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. నిర్మాత ఎస్.వి.బాబు రాజీపడని తనమే ఈ సినిమా ఓటీటీలో కాకుండా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. నవ్వు, లవ్వు రెండూ ఉన్న సినిమా ఇది. 'మగధీర', 'జానకీరాముడు' వంటి చిత్రాలతో ఈ సినిమాని ప్రేక్షకులు పోల్చినప్పటికీ సినిమా కచ్చితంగా అలరించడం ఖాయం. ఇప్పటికే రెండు పెద్ద బ్యానర్ల ద్వారా దర్శకుడిగా అవకాశాలొచ్చాయి' అని చెప్పారు.