Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్ జంటగా ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'చెప్పినా ఎవరూ నమ్మరు'. ఎం.మురళీ శ్రీనివాసులు నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మంగళవారం ప్రి-రిలీజ్ వేడుకను ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా హీరో, డైరెక్టర్ ఆర్యన్ కృష్ణ మాట్లాడుతూ,'మా నిర్మాత మురళి శ్రీనివాస్ చాలా పెయిన్ తీసుకుని సినిమాని ఇక్కడిదాకా తీసుకొచ్చారు. మేం అనుకున్న మైల్ స్టోన్‌ను చేరుకుని మా నిర్మాతకు మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నాం. మా సినిమాని మూవీ మాక్స్ అధినేత శ్రీనివాస్ ద్వారా ఈ నెల 29న విడుదల చేస్తున్నాం. మేం విడుదల చేసిన పాటలకు, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంశలు వచ్చాయి' అని చెప్పారు.
డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ,'మంచి కంటెంట్‌తో ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఈ సినిమా ఉంటుంది. ఇటువంటి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి మంచి థియేటర్స్ దొరికాయి' అని అన్నారు. 'థ్రిల్లింగ్ క్రైమ్, యాక్షన్, లవ్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న యూత్‌ఫుల్ చిత్రమిది. యూత్‌కి కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి' అని నిర్మాత మురళీ శ్రీనివాసులు తెలిపారు.