Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యానర్ పై మధురా శ్రీధర్ రెడ్డి సమర్పణలో రూపొందిన చిత్రం 'లవ్ లైఫ్ అండ్ పకోడి'. కార్తిక్ బిమల్ రెబ్బ, సంచిత పొనాచ జంటగా నటించారు. జయంత్ గాలి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల12న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను యువ కథానాయకుడు అల్లు శిరీష్ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డి మాట్లాడుతూ, 'ఇలాంటి లవ్‌స్టోరీ సినిమాని తెలుగులో చూడలేదని గర్వంగా చెప్పగలను. హీరో, హీరోయన్లు ఉంటారు. వాళ్ల మధ్య డిఫరెన్సెస్ వస్తాయి. మళ్లీ చివరలో కలుస్తారు. ఇదే సహజంగా మన సినిమాల్లో ఉంటుంది. కానీ మా చిత్రంలో హీరో, హీరోయిన్లు కలవడం.. విడిపోవడం, చివరకు కలవడం పూర్తిగా కొత్తగా ఉంటుంది' అని తెలిపారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ, 'ట్రైలర్ చూశాను చాలా నచ్చింది. మ్యారేజ్, లవ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని నాకూ ఉంది. సంచిత, కార్తీక్ బాగా నటించారు. సింగిల్ స్క్రీన్స్ కాకుండా మల్టీఫ్లెక్స్‌లో రిలీజ్ చేస్తుండటం శ్రీధర్‌గారి తెలివైన ఆలోచన' అని చెప్పారు. మధురా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ,' గతంలో బాలచందర్ గారు హ్యూమన్ ఎమోషన్స్‌ను ఎలా చూపించారో మా చిత్ర దర్శకుడు అలా చూపించారు. 70 మల్టీఫ్లెక్స్‌లో మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఇది చాలా స్పెషల్ రిలీజ్. రూల్స్ బ్రేక్ చేసి సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. నిజాయితీగా చేసిన ప్రయత్నమిది. మీకు తప్పకుండా నచ్చుతుంది' అని అన్నారు. హీరో కార్తిక్ బిమల్ రెబ్బ మాట్లాడుతూ, 'ఈ కాన్సెప్ట్ రిలేషన్‌షిప్స్ గురించి చెబుతుంది. ప్రేమలోని సంబంధాలను చాలా బాగా చెప్పారు. ఇందులో నా క్యారెక్టర్ పేరు అరుణ్. పకోడీ ఏంటి అనేది సినిమా చూశాక తెలుస్తుంది. ఈ కథ ఎవరి జీవితాల్లోనైనా జరగొచ్చు. ఆ సందర్భాలకు మీరు ఎలా రియాక్ట్ అవుతారనేదే కథ' అని తెలిపారు. హీరోయిన్ సంచిత పొనాచ మాట్లాడుతూ, 'ఇది న్యూ ఏజ్ స్టోరీ. లవ్, రిలేషన్‌ను డీప్‌గా చూపిస్తుంది' అని అన్నారు. 'ఈ సినిమా బడ్జెట్ చిన్నది కానీ నిజాయితీగా ఉంటుంది. మరే పెద్ద సినిమాకీ తీసిపోదు. లవ్ అంటే హదయం అని చూపిస్తారు. కానీ ప్రేమ అనే దానికి కూడా ఒక హార్ట్ ఉంటుంది. పకోడిలో ఉన్నట్లు రకరకాల రుచులు సినిమాలో ఉంటాయి. మీ మనసుని తాకే సినిమా అని నమ్ముతున్నాను' అని దర్శక, నిర్మాత జయంత్ గాలి చెప్పారు.