Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజేంద్ర ప్రసాద్ తాజాగా నటించిన చిత్రం 'క్లైమాక్స్'. కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై రాజేశ్వర్‌రెడ్డి, కరుణాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు భవాని శంకర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ,'ఈ టైటిల్‌కి తగ్గట్టే సినిమా మొత్తం రివీల్ అయ్యేది క్లైమాక్స్‌లోనే. అందుకే 'క్లైమాక్స్' అని టైటిల్ పెట్టాం. మర్డర్ మిస్టరీ అయినప్పటికీ సినిమా అంతా హిలేరియస్‌గా ఉంటుంది. అలాగే అన్ని టెన్షన్స్ కూడా ఉంటాయి. ఇందులో రాజేంద్రప్రసాద్‌కి మోడీ అనే పేరు ఎందుకు పెట్టామనేది ఇప్పుడే చెప్పేస్తే బాగోదు. అదంతా 'క్లైమాక్స్'లోనే రివీల్ అవుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరికీ నేను పెట్టిన 'మోడీ' పేరు కరెక్ట్ అనిపిస్తుంది. సెన్సార్ వాళ్ళు సినిమా చూసిన కూడా ఏమీ అనలేదు. వాళ్ళకి ఈ పేరు ఎందుకు పెట్టామో అర్ధమైపోయింది. కథాపరంగా, తనకి ఫ్యామిలీ ఉన్నప్పటికీ ఒక మల్టీ మిలీనియర్ ఒక హౌటల్‌లోనే ఉండిపోతాడు. కానీ అక్కడే 500 కోట్లు కూడా ఉంటాయి. సడన్‌గా అతను చనిపోతాడు. అలాగే ఆ 500 కోట్లు కనిపించవు. ఈ నేపథ్యంలో ఎండింగ్‌లో ఏం జరిగిందనేదే ఈ సినిమా. ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయమని నెట్ ఫ్లిక్స్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. ఒకటిన్నర గంట మాత్రమే ఉండే ఈ సినిమాలోని షాట్స్, డైలాగ్స్ ఇంతకు ముందు ఏ సినిమాలో కూడా ఉన్నట్టు ఉండవు.. అలా రాసుకున్నా. రాజేంద్రప్రసాద్‌తో ఎవ్వరూ తీయని కొత్త కథతో, ఎప్పుడూ చూడని కథనాలతో రూపొందిన ఈ సినిమా ప్రతీ ఒక్కరికీ పైసా వసూల్ అనేలా ఉంటుంది. 'డ్రీమ్స్' వంటి అవార్డ్ విన్నింగ్ తర్వాత మరో వినూత్న సినిమాకి దర్శకత్వం వహించినందుకు ఆనందంగా ఉంది' అని చెప్పారు.