Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా డెన్నీస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. ఈ సినిమా ఈనెల 5న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా కథానాయకుడు సందీప్‌కిషన్ బుధవారం మీడియాతో సంభాషించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ఈ సినిమా సెకండాఫ్ చూసి నాతో తొమ్మిదేళ్లు ట్రావెల్ చేసిన టీం కాల్ చేసి ఏడ్చేస్తున్నారు. నాక్కూడా కన్నీళ్ళొచ్చాయి. ప్రేక్షకులు కూడా ఇదే అనుభూతితో థియేటర్ల నుంచి వస్తే చాలు. మేము సక్సెస్ అయ్యినట్టే. ఏ ఆటలోనైనా ఓ ఆటగాడికి ప్రతిభ ఉన్నప్పటికీ రావాల్సిన గుర్తింపు, ఆదరణ రాకపోవడానికి ఆ రంగంలో ఉన్న రాజకీయాలు కూడా కారణం. ఏం చేస్తే గుర్తింపు లభిస్తుందనే అంశాన్ని బాగా ఫోకస్ చేశాం. ఈ సినిమా కోసం ఆరు నెలలు ముందే హాకీ నేర్చుకున్నా. సినిమాలో మాత్రం హాకీ గేమ్ అదిరిపోద్ది. క్రికెట్‌తో పోలిస్తే హాకీకి ఆదరణ తక్కువ. కాబట్టి ఈ సినిమా చేయటం ఏమైనా రిస్క్ అనిపించిందా అని అందరూ అడుగుతున్నారు. క్రికెట్ చాలా పాపులర్. అది కాకుండా ఈ సినిమాలో కొత్తగా ట్రై చేయాలని హాకీ తీసుకున్నాం. ఈ గేమ్‌లో ఆటగాళ్ళ ఎమోషన్లు ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి. అలాగే స్క్రీన్ ప్రజెన్స్ కూడా చాలా బాగుంటుంది. థియేటర్లలో ప్రేక్షకులకు విజువల్ బ్యూటీ బాగా దొరుకుతుంది. నిజంగా చెప్పాలంటే ఇదొక మాసివ్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్. రెగ్యులర్‌గా చేసే రోమ్ కామ్‌లో ఏదో సింపుల్‌గా ఇచ్చినవి, చేసేస్తే చాలు అన్నట్టే ఉంటుంది. కానీ ఇలాంటి వాటిలో మాత్రం ఒక గ్రాఫ్, జర్నీ, అప్ అండ్ డౌన్స్ లాంటివి చాలా ఉంటాయి. నటుడిగా ఏం ప్రూవ్ చేసుకోవాలి అనేది ఉంటుంది. ఈ సినిమాలో నాకు, లావణ్యకి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. అయితే చెప్పాలనుకున్న కథ ఇది కాదు. కాబట్టి దీన్ని ఒక కొత్త కమర్షియల్ సినిమా అని చెప్తా. ప్రస్తుతం 'రౌడీ బేబీ' చేస్తున్నాను. అలాగే 'వివాహ భోజనంబు'లో ఓ చిన్న అతిథి పాత్ర చేశా. కంటెంట్ బాగుండటంతో నేనే ప్రొడ్యూస్ చేస్తున్నా. వీటితోపాటు మహేష్ కోనేరు ప్రొడక్షన్‌లో ఒకటి, ఏకే ఎంటెర్టైన్మెంట్స్‌లో మరొక సినిమా చేసేందుకు గ్రీన్‌సిగల్ ఇచ్చా.