Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ పతాకంపై కిషోర్ బి. దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'శ్రీకారం'. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈనెల 11న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన నరేష్ వికె మీడియాతో ముచ్చటించారు. వినోదాన్ని ఓ కొత్త బ్యాక్ డ్రాప్‌లో తీసుకుని, దానికి ఎమోషన్‌ని యాడ్ చేశారు. ఒక యువ దర్శకుడితో ఈ సినిమా తీసినందుకు 14రీల్స్ ప్లస్ నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట, హరీష్ కట్టాని అభినందిస్తున్నాను. రియాల్టీకి దగ్గరగా ఎమోషన్స్‌ని కనెక్ట్ చేసి తీసిన ఈ సినిమా 14 రీల్స్ ప్లస్‌కి అవార్డులు, రివార్డులు తీసుకొస్తుంది. ఈ సినిమా కోసం 20 ఎకరాల్లో ఒక పొలం సెట్ వేయడం నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ రోజుల్లో చాలా మంది ఎన్నారైలు ఉద్యోగాలు వదిలిపెట్టి వ్యవసాయం చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. దాన్ని బేస్‌గా తీసుకుని కిషోర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇలాంటి మంచి సబ్జెక్ట్‌ని ఎంచుకున్న శర్వాని అభినంద నీయుడు. సాయి మాధవ్ బుర్రా అద్భుతమైన సంభాషణల్ని రాశారు. ఈ సినిమాలో చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యే రైతు పాత్రలో నటించాను. కథలో చాలా ముఖ్యమైన పాత్ర. నా కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయే పాత్ర కూడా. ఇప్పటికే ఈ సినిమా మ్యూజికల్‌గా మంచి హిట్ అయ్యింది. అన్ని రకాలుగా జాతీయ స్థాయిలో చెప్పుకునే మంచి సినిమా అవుతుంది. ఈ నాలుగు నెలల కాలంలో 12 సినిమాల్ని పూర్తి చేశాను. అన్ని మంచి పాత్రలే కావడం విశేషం. నటనలో నాకు ఎస్.వి. రంగారావుగారు స్పూర్తి. ఆయనలా అన్ని రకాల పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాలన్నదే నా అభిలాష' అని నరేష్ చెప్పారు.