Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల 'క్రాక్', 'నాంది' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను తన నటనతో అమితంగా ఆకట్టుకున్న విలక్షణ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. ఆమె నాయికగా హవీష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కాంచన కోనేరు ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోనేరు సత్యనారాయణ సమర్పిస్తున్న ఈ చిత్రానికి డార్లింగ్ స్వామి దర్శకుడు. శుక్రవారం వరలక్ష్మీ శరత్‌కుమార్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్ట్‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు. హారర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ సినిమాలో వరలక్ష్మి ఓ విలక్షణ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: కోనేరు సత్యనారాయణ, నిర్మాత: కాంచన కోనేరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకష్ణ కొడాలి, ఆర్ట్: గాంధీ నడికుడికర్, ఎడిటింగ్: అమర్ రెడ్డి, కథ, మాటలు, దర్శకత్వం: డార్లింగ్ స్వామి.