Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం 'చావు కబురు చల్లగా'. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. 'అదిరిపోయే కామెడీ సీన్స్, అద్భుతమైన ఎమోషన్, మంచి కథతో అన్ని కమర్షియల్ హంగులతో ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్, హీరో కార్తికేయ 'బస్తి బాలరాజు' ఫస్ట్ లుక్, ఇంట్రోతో పాటు క్యారెక్టర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్‌కి, టీజర్ గ్లిమ్స్‌కి, 'మైనేమ్ ఈజ్ రాజు', 'కదిలే కాలాన్ని', 'పైన పటారం లోన లొటారం' పాటలకు అనూహ్య స్పందన లభించింది. తాజాగా ట్రైలర్ కూడా అదే స్థాయిలో అలరిస్తోంది. ముఖ్యంగా ఇందులో కార్తికేయ గెటప్, డైలాగ్ డెలివరికి మంచి రెస్పాన్స్ వస్తోంది. 'ఆకలి, నిద్ర, మూర్ఖత్వం ఇవి కాకుండా.. జాలి, దయ, మానవత్వం అంటే ఏంటో తెలుసారా నీ మనస్సాక్షికి..', 'అమ్మాయిలందరూ ఎధవలకే పడతారంటారు.. అందులో నేను నెంబర్ వన్.. నన్ను మించిన ఆప్షన్ ఎక్కడ ఉంటుంది నీకు..', 'ఇందాక ఫోన్‌లో చూసావే.. నాది యాక్టింగ్ మాత్రమే.. నువ్వు ఎక్కువ చేసావ్ అనుకో.. నీకు ఒరిజినల్ పడిపోద్ది..' అంటూ ట్రైలర్‌లోని డైలాగ్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది' అని చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ,'ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పబ్లిసిటీ కంటెంట్‌కు అనూహ్య స్పందన లభించింది. మాస్ అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే ట్రైలర్ కూడా వచ్చింది' అని తెలిపారు. ఈ చిత్రాన్ని ఈనెల 19న భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాత బన్నీ వాసు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలోని పాటలను ఆదిత్య మ్యూజిక్ రిలీజ్ చేస్తోంది.