Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో కావాలనే కలని సాకారం చేసుకోవడానికి చేస్తున్న సాప్ట్‌వేర్ జాబ్‌ని సైతం వదిలేసి తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఆర్యన్ గౌర అడుగు పెట్టారు. 'జి-జాంబీ' చిత్రంతో హీరోగా నటించి తన కలని నెరవేర్చుకున్నాడు. తెలుగులో జాంబీస్ జోనర్‌ని పరిచయం చేస్తూ ఆర్యన్ గౌర హీరోగా ఆర్యన్-దీపు దర్శకత్వం వహించిన చిత్రం 'జి-జాంబీ'. సాయి సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై సూర్య నిర్మించిన చిత్రం థియేటర్లలోను, అమెజాన్ ప్రైమ్‌లోనూ విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది.
ఇటీవల ఈ చిత్రాన్ని సోనుసూద్ వీక్షించి, చిత్ర యూనిట్‌ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'ఆర్యన్, దీపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో హ్యూజ్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంది. అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి ఇంకా పెద్ద హిట్ చేయండి. ఇలాంటి కొత్త టీమ్‌ని ఎంకరేజ్ చేసి, సపోర్ట్ చేయాలి. అప్పుడే డిఫరెంట్ చిత్రాలు వస్తాయి. ఇంత మంచి సినిమాలో హీరోగా నటించిన ఆర్యన్ గౌరని అభినందిస్తున్నాను' అని చెప్పారు.