Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్, మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'పక్కా కమర్షియల్'. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీవాసు నిర్మిస్తున్న చిత్రమిది.
తాజాగా ఈ చిత్ర రెగ్యులర్ చిత్రీకరణ హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ క్వార్టర్స్‌లో మొదలైంది. 'ఈ సినిమాతో ముచ్చటగా మూడోసారి జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ - బన్నీవాసు - మారుతి కాంబినేషన్ సెట్ అవ్వడం విశేషం. గతంలో ఈ బ్యానర్స్ నుంచే దర్శకుడు మారుతి 'భలేభలే మగాడివోరు', 'ప్రతిరోజు పండగే' వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు జిఏ2 పిక్చర్స్, యూవి క్రియేషన్స్‌లో 'భలే భలే మగాడివోరు', 'టాక్సీవాలా', 'ప్రతిరోజు పండుగ'తో హాట్రిక్ రాగా, ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టారు. గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ చిత్రానికి జకేస్ బీజారు సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్‌కేఎన్ సహనిర్మాత. ఇందులో హీరోయిన్ ఎవరనే విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.