Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'టక్ జగదీష్'. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్ర ట్రైలర్ పోస్టర్‌ను గురువారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈనెల 13న ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈనెల 23న సినిమా వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ట్రైలర్ రిలీజ్ పోస్టర్ ఆవిష్కరణ ప్రెస్‌మీట్‌లో నాని మాట్లాడుతూ, 'సినిమా ఫైనల్ కట్ చూశాక, డైరెక్టర్ శివ నిర్వాణతో ఫిక్సయిపో.. సినిమా బ్లాక్‌బస్టర్ అని చెప్పాను. కెరీర్‌లో బాగా సంతృప్తినిచ్చిన చిత్రమిది' అని అన్నారు.