Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్ త్వరలో తన అభిమానులకు బహుమతి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న 'అరవింద సమేత' టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం 'అరవింద సమేత' చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. 'వీర రాఘవ' అనేది ట్యాగ్‌లైన్. త్రివిక్రమ్ దర్శకత్వంలో తొలిసారి ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రమిది. పూజా హెగ్డే కథానాయిక. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజున చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. సిక్స్ ప్యాక్‌లో ఎన్టీఆర్ ఆకట్టుకున్నారు. తాజాగా ఇండిపెండెంట్ డే సందర్బంగా చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్టు నిర్మాణ సంస్థ గురువారం ప్రకటించింది.