Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రియాలిటీకి దగ్గరగా, నేటి తరం కథానాయికలతో సమానంగా సినిమాలు చేయాలనుకుంటున్నా' అని అంటోంది కల్కీ కొచ్లిన్. బాలీవుడ్‌లో సమాంతర సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు కల్కీ కొచ్లిన్. విలక్షణ కథానాయికగా ప్రేక్షకుల మెప్పు పొందారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా చిత్రాల్లో నటిస్తూ అందరినీ అలరిస్తున్నారు. ఈ సందర్భంగా తన సినిమా ప్రయాణం గురించి చెబుతూ, 'కెరీర్ ప్రారంభంలో నేను మొండిగా ఉండేదాన్ని. కేవలం ఒక నటిగా ఉండాలని, మరే దానిపై దృష్టి పెట్టలేదు. చాలా మంది రైటింగ్, దర్శకత్వం వైపు ఆలోచించమని సలహాలిచ్చేవారు. కానీ నేను నటిగానే పరిమితమవ్వాలనే ఆలోచనలోనే చాలా రోజులు గడిపాను. ఇప్పుడు మల్టీటాస్కింగ్ అవసరం అనిపిస్తోంది. చాలా సార్లు నేను నా చిత్ర దర్శకులతో కలిసి పలు సీన్లను రీ రైట్ చేసేదాన్ని. కొన్నిసార్లు సొంతంగానూ రాశాను. ఈ క్రమంలో నేను చేసే పనిని పాత్రలను మార్చుకోవాలని తెలుసుకున్నా. యంగ్‌స్టర్స్‌తోపాటు మనమూ ముందుకు సాగాలని, ఎప్పుడూ వారికి రిలవెంట్‌గా ఉండాలని అర్థమైంది. ఈ గేమ్‌లో చాలా ఒత్తిడి ఉంటుంది. అయితే ఇక్కడ మన క్రియేటివిటీకి హద్దులు లేవు. ఎవరు ఏదైనా చేయ వచ్చు' అని తెలిపింది. కల్కీ ప్రస్తుతం 'స్కాలర్‌షిప్', 'గల్లీబారు', 'హాథీ మేరే సాథీ' చిత్రాల్లో నటిస్తున్నారు.